News March 25, 2024
NGKL: ఉపాధి కోసం వెళ్లి కొడుకును పొగొట్టుకున్నారు !

ఒంటిపై వేడినూనె పడి <<12918373>>చిన్నారి జయదేవ్<<>>(3) మృతి వెల్దండ మండలం బండోనిపల్లిలో విషాదం నింపింది. అర్జున్, శారదమ్మ దంపతులు జాతరల్లో స్వీట్లు, తినుబండారాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమనగల్లు వేంకటేశ్వరస్వామి జాతరలో స్వీట్లు విక్రయించేందుకు పిల్లలతో సహా వెళ్లారు. స్వీట్లు చేస్తుండగా జయదేవ్ ఒంటిపై నూనెపడి తీవ్ర గాయాలతో మృతిచెందాడు. కళ్లముందే చిన్నారి మృతితో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Similar News
News September 9, 2025
తెలుగు యూనివర్శిటీ తొలి Ph.D అందుకున్నది పాలమూరు వ్యక్తే!

MBNRకు చెందిన కపిలవాయి లింగమూర్తి TG ఏర్పడ్డ తర్వాత తెలుగు వర్శిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న తొలి వ్యక్తి. సుమారు 7 దశాబ్దాల పాటు తెలుగు సాహిత్య రంగానికి ఆయన చేసిన విశేష సేవలను గుర్తించి 2014లో తెలుగు యూనివర్శిటీ 13వ స్నాతకోత్సవంలో ఆయనకు గౌరవ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ (డీలిట్)ను ప్రదానం చేసింది. ప్రతిభ పురస్కారం కూడా అందుకున్నారు. నేడు TG భాషా దినోత్సవం సందర్భంగా Way2News ప్రత్యేక కథనం.
News September 8, 2025
14న లోక్ అదాలత్.. సద్వినియోగం చేసుకోండి- SP జానకి

త్వరిత న్యాయం కోసం జాతీయ మెగా లోక్ అదాలత్ ఈనెల 14న నిర్వహిస్తున్నట్లు మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ‘రాజీయే రాజమార్గం.. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని, జుడీషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి, ఈ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని’ అన్నారు.
News September 8, 2025
MBNR: 3,000 విగ్రహాల నిమజ్జనం ప్రశాంతం: ఎస్పీ

మహబూబ్‌నగర్ జిల్లాలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,000 విగ్రహాలను నిబంధనల ప్రకారం వివిధ చెరువులు, శివార్లలో నిమజ్జనం చేశారని ఆమె చెప్పారు. కొద్ది రోజులుగా భక్తిశ్రద్ధలతో జరిగిన గణేశ్ ఉత్సవాలు, అనంతరం నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముగిశాయని పేర్కొన్నారు.