News March 26, 2025

అనంత: ‘రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి’

image

క్షేత్రస్థాయిలో ఎలాంటి పెండింగ్ లేకుండా రెవెన్యూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ, భూ అప్పగింత, రీసర్వే, రెవెన్యూ సర్వీసులు, PGRS, తదితర అంశాలపై RDOలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Similar News

News March 29, 2025

కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నాం: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఆదివారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు-2025 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం తెలిపారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఉగాది వేడుకలకు ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.

News March 29, 2025

ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అందుకున్న అంజనప్ప

image

అనంతపురం జిల్లాకు చెందిన తేనే తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్.అంజనప్ప శుక్రవారం ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అందుకున్నారు. కనుమరుగవుతున్న కళా రూపాలకు పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలలో 221 కళాభిషేకం కార్యక్రమాలు పూర్తి చేసినందుకుగాను ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అవార్డు దక్కిందని తెలిపారు.

News March 29, 2025

గుంతకల్లు: రైల్లో ప్రయాణికుడి మృతి

image

గుంతకల్లు మండలం పాత కొత్త చెరువు సమీపంలో ఇంటర్ సిటీ రైల్లో ప్రయాణిస్తున్న మహబూబ్ బాషా(59) శుక్రవారం మృతి చెందాడు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటికి చెందిన ఈయన.. ఈనెల రెండో తేదీన గోవా వెళ్లాడు. తిరిగి సొంతూరుకు వెళ్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని తాడిపత్రిలో రైల్వే ఎస్ఐ నాగప్ప, పోలీసు సిబ్బంది స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!