News March 26, 2025
కలెక్టర్ల సదస్సు హాజరైన నంద్యాల కలెక్టర్

అమరావతిలో గల వెలగపూడిలో ఉన్న సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో రెండు రోజులపాటు జరగనున్న రాష్ట్ర కలెక్టర్ల సదస్సుకు మంగళవారం నంద్యాల కలెక్టర్ రాజకుమారి గనియా హాజరయ్యారు. ఈ సదస్సుకు 26 జిల్లాల నుంచి కలెక్టర్లు హాజరుకాగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సదస్సులో కలెక్టర్లతో పాటు పలు శాఖల మంత్రులు ముఖ్య అధికారులు ఉన్నారు.
Similar News
News November 3, 2025
లోకేశ్వరం: మనస్పర్ధలతో యువతి.. బాధతో యువకుడు ఆత్మహత్య

నిర్మల్ జిల్లాలో మనస్పర్ధలతో యువతి.. బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. లోకేశ్వరం(M) వట్టోలికి చెందిన అఖిలతో అదే గ్రామానికి చెందిన నరేశ్‌కు పరిచయముంది. కొన్ని రోజులుగా వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో యువతి పురుగు మందు తాగి సూసైడ్ చేసుకుంది. విషయం తెలుసుకున్న నరేశ్ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని SI అశోక్ తెలిపారు.
News November 3, 2025
కట్నం వద్దు కానీ.. 10 కండీషన్స్! చదివేయండి

తనకు కట్నం వద్దు కానీ వధువు 10 కండీషన్స్‌కు ఓకే చెప్పాలని ఓ యువకుడు SMలో పోస్ట్ చేశాడు. 1.No PreWed షూట్, 2.లెహంగా బదులు చీర ధరించాలి, 3.సంప్రదాయ సంగీతం ఉండాలి. 4.దండలు ప్రశాంతంగా మార్చుకోవాలి. 5.పూజారి తంతును ఎవరూ ఆపరాదు. 6.ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ జోక్యం ఉండొద్దు. 7. అభ్యంతరకర పోజులు అడగొద్దు. 8.వేదికపై నో కిస్సెస్/హగ్స్. 9.పెళ్లి పగలే జరగాలి. 10.సాయంత్రానికి అప్పగింతలు పూర్తి చేయాలి.
News November 3, 2025
వెంకటగిరి MLA గారూ.. ఈ రోడ్డును చూడండి

రోజూ వేలాదిమంది రాకపోకలు సాగించే వెంకటగిరి-గూడూరు రోడ్డు ఇది. రూ.40 కోట్లతో పనులు ప్రారంభించారు. 8నెలల కిందట పనులు ఆపేశారు. బాలాయపల్లె-అమ్మపాలెం మధ్య రోడ్డు దారుణంగా ఉండటంతో రాకపోకలకు రెట్టింపు సమయం అవుతోంది. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని MLA కురుగొండ్ల ఎప్పుడో ప్రకటించారు. ఈలోగా భారీ వర్షాలు రావడంతో ఇలా మారింది. మా MLA ఎప్పుడు పనులు చేయిస్తాడో ఏమో అని రోజూ వేలాది మంది ప్రశ్నిస్తూనే ఉన్నారు.


