News March 26, 2025
లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరం: MNCL కలెక్టర్

లింగ నిర్ధారణ పరీక్ష చేయడం చట్టరీత్యా నేరమని, ఇందుకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. స్కానింగ్ సెంటర్లలో పుట్టబోయేది ఆడబిడ్డ, మగబిడ్డ అని తెలపవద్దని సూచించారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో తగ్గిన బాలికల నిష్పత్తిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News September 18, 2025
జీకేవీధి: పాము కాటుకు గురై బాలిక మృతి

గూడెం కొత్తవీధిలోని బొంతువలసకు చెందిన మర్రి కవిత (9) పాము కాటుకు గురై మృతి చెందింది. ఇంట్లో పడుకున్న సమయంలో బుధవారం తెల్లవారుజామున పాము కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని తల్లిదండ్రులు పెద్దవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News September 18, 2025
రేపు కాకతీయ యూనివర్సిటీలో జాబ్ మేళా..!

యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళాలో అనేక కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్ సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ డా.రహమాన్ పాల్గొన్నారు.
News September 18, 2025
విజయవాడ: దసరాకు 422 ప్రత్యేక బస్సులు

దసరా, విజయవాడ ఉత్సవాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు 422 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 12 డిపోల నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రద్దీకి అనుగుణంగా ప్రతి రోజు ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతామని పేర్కొన్నారు.