News March 26, 2025
కన్నేపల్లిలో ముగ్గురు అరెస్ట్.. ఏడుగురు పరారీ

కన్నేపల్లి మండలం ముత్తాపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ గంగారాం తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న ముగ్గురు జూదరులను అరెస్ట్ చేశామని, మరో ఏడుగురు పారిపోయినట్లు వెల్లడించారు. వారి వద్ద రూ.1500 నగదు, 2ఆటోలు, 2 బైకులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News July 4, 2025
సిరిసిల్ల రచయితకు దక్కిన అరుదైన గౌరవం

సిరిసిల్లకు చెందిన ప్రముఖ రచయిత డా.పెద్దింటి అశోక్ కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన రచించిన ‘లాంగ్ మార్చ్’ నవలను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కళాశాలల్లో MA తెలుగు సెకండ్ ఇయర్ సిలబస్‌లోకి చేర్చారు. ఆయన రచించిన మరో ప్రఖ్యాత నవల ‘జిగిరి’ను నల్గొండ జిల్లా నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ అకాడమిక్ సిలబస్‌గా బోధించనున్నారు. చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లె పాఠశాలలో పనిచేస్తున్నారు
News July 4, 2025
గ్రూపులు కడితే భయపడతామా?.. ఎమ్మెల్యేలపై ఖర్గే ఫైర్!

TG: పీఏసీ సమావేశంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆగ్రహించినట్లు తెలుస్తోంది. ‘నలుగురైదుగురు కలిసి గ్రూపులు కడితే భయపడతామని అనుకుంటున్నారా? ఇష్టారాజ్యంగా మాట్లాడే వాళ్లను నేను, రాహుల్ పట్టించుకోం’ అని ఖర్గే మండిపడినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడే వారికి, పదవులకు వన్నె తెచ్చే సమర్థులకు మాత్రమే వాటిని ఇవ్వాల్సిందిగా TPCCని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.
News July 4, 2025
పవన్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుతో ఉపయోగమేంటి?

AP Dy.CM పవన్ మార్కాపురంలో రూ.1,290 కోట్లతో <<16937877>>తాగునీటి పథకానికి <<>>శంకుస్థాపన చేశారు. వెలిగొండ నుంచి నీటిని తీసుకుని యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, కొండేపి, కందుకూరు నియోజకవర్గాల తాగునీటి కష్టాలు తీర్చనున్నారు. ఇందులో భాగంగా ఒక వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, 334 ఓవర్ హెడ్ ట్యాంకులు, 5 వేల కి.మీ మేర పైపులైన్లు నిర్మిస్తారు. 18-20 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.