News March 26, 2025
రుద్రవరంలో రాష్ట్రంలోనే అత్యధికం..!

నంద్యాల జిల్లాలో కొద్ది రోజులుగా భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం మంగళవారం నంద్యాల జిల్లా రుద్రవరంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.6°C ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి కాలం ప్రారంభంలోనే ఈ స్థాయిలో భానుడు విరుచుకుపడటంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, కొద్దిరోజులుగా నంద్యాల జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.
Similar News
News March 30, 2025
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

ప్రతి సోమవారం నంద్యాల కలెక్టరేట్‌లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈనెల 31వ తేదీన రంజాన్ పండుగ సందర్భంగా కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
News March 30, 2025
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

చిన్నగంజాం మండలంలో ఏప్రిల్ 1న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి పరిశీలించారు. ఆదివారం జిల్లా అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ తుషార్ డూడిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్ పాల్గొన్నారు.
News March 30, 2025
విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

వేసవిలో ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా నరసాపురం(NS), కర్ణాటకలోని అరిసికెరె(ASK) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 6 నుంచి మే 25 వరకు ప్రతి ఆదివారం NS- ASK(నెం.07201), ఏప్రిల్ 7 నుంచి మే 26 వరకు ప్రతి సోమవారం ASK- NS(నెం.07202) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.