News March 26, 2025

వరంగల్: బస్టాండ్ నిర్మాణ పనుల్లో బాంబుల వినియోగం

image

వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనుల్లో ఆనధారితంగా బస్టాండ్ నిర్మాణం పనుల్లో బాంబులు ఉపయోగిస్తున్నారని ప్రజలు తెలిపారు. పునాది పనుల్లో  బాంబు పేలడంతో భూపాలపల్లి డిపో బస్సు అద్దాలు పగిలినట్లు ప్రజలు తెలిపారు. ప్రయాణికులు తప్పిన పెనుముప్పు. పోలీస్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.  

Similar News

News March 30, 2025

వరంగల్: నేడు, రేపు.. అవి తెరిచే ఉంటాయి!

image

వరంగల్ మహా నగర పాలక సంస్థ పన్నుల వన్ టైమ్ సెటిల్మెంట్ చెల్లింపు కోసం నేడు(ఆదివారం), రేపు(సోమవారం) మీ సేవా కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ కేంద్రాలు తెరిచే ఉండనున్నాయి. వన్ టైమ్ సెటిల్మెంట్ గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ప్రజల కోసం ఈ అవకాశాన్ని కల్పించినట్లు గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. పాత బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ మినహాయింపు పొందాలన్నారు.

News March 30, 2025

WGL: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

image

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. వరంగల్ జిల్లాలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ తెలుగు నూతన సంవత్సరంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ఈ ఏడాది నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘ కీ ‘ రోల్ కాబోతుంది.

News March 30, 2025

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సురేఖ

image

రాష్ట్ర ప్రజానీకం, ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకు తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉగాది పర్వదినం సందర్భంగా శనివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొని, ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. 

error: Content is protected !!