News March 26, 2025
గద్వాల: కోర్టు సముదాయానికి రూ.81కోట్లు మంజూరు

గద్వాల జిల్లాకు కొత్త సమీకృత కోర్టు సముదాయ భవనం మంజూరైందని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న న్యాయస్థానం నిర్మాణనికి రూ.81 కోట్ల నిధులు విడుదల అయినట్లు అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 31, 2025
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన రంజాన్ : VZM SP

విజయనగరం జిల్లాలో రంజాన్ పండగ హిందూ – ముస్లిం సోదరుల మధ్య సోదర భావం పెల్లుబికి, పండగలో ఎటువంటి మత విద్వేషాలు, సంఘర్షలు, అల్లర్లు జరగకుండా ప్రశాంతయుతంగా ముగిసినట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినాన జిల్లాలో ఎటువంటి మత ఘర్షణలు తలెత్తకుండా జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు భద్రత చర్యలు సత్ఫలితాలనిచ్చాయని అన్నారు.
News March 31, 2025
అమలాపురం: రేపు యధావిధిగా సోషల్ పరీక్ష: డీఈవో

పదవ తరగతి సోషల్ పరీక్ష మంగళవారం యధావిధిగా జరుగుతుందని అంబేడ్కర్ కోనసీమ డీఈవో సలీం భాషా సోమవారం తెలిపారు. ఒకటవ తేదీ సోమవారం ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ జీవో జారీ చేసిందన్నారు. కావున రేపు జరగాల్సిన సోషల్ పరీక్ష యధావిధిగా జరుగుతుందని చెప్పారు. జిల్లాలోని డివైఈవోలు, ఎంఈవోలు, జడ్పీహెచ్ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. విద్యార్థులందరికీ విషయం తెలియపరచాలన్నారు.
News March 31, 2025
ఉప్పల్: ‘అద్భుతంగా మెట్రో ఆర్ట్ ఫెస్ట్’

HYD మెట్రో ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ట్ ఫెస్ట్ అద్భుతంగా ముగిసిందని మెట్రో సంస్థ తెలిపింది. గ్రీన్ లైన్, రెడ్ లైన్, బ్లూ లైన్ ప్రయాణికులు పాల్గొని, తమ ఊహలను చిత్రాలుగా మలిచి అద్భుతమైన ప్రదర్శన కనబరిచినట్లుగా పేర్కొంది. ఆర్టిస్టుల ప్రదర్శన చిత్రాలను ప్రత్యేక గాలరీలో భద్రపరుస్తామని HYD నాగోల్, అమీర్పేట మెట్రో అధికారులు తెలిపారు.