News March 26, 2025
ములుగు: పిల్లల పాలిట శాపంగా ‘బోనోఫిక్స్’ మత్తు!

ములుగు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బోనోఫిక్స్ మత్తు పిల్లల పాలిట శాపంగా మారుతోంది. గంజాయి, డ్రగ్స్, మద్యపానం వంటి మత్తు పదార్థాల గురించి వింటూనే ఉంటాం. కానీ విద్యార్థులు, పిల్లలు బోనోఫిక్స్ అనే మత్తు పదార్థానికి అలవాటు పడుతున్నారు. పోలీసులు నిఘాతో దాడులు చేస్తున్న బోనోఫిక్స్ అమ్మకాలు ఆగడం లేదు. కొందరు షాపుల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా బోనోఫిక్స్ అమ్ముతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు.
Similar News
News October 27, 2025
యాదాద్రి: ప్రభుత్వ కార్యాలయాలకు మంత్రి శంకుస్థాపన

మోటకొండూర్ మండల కేంద్రంలో నిర్మించనున్న నూతన MRO, MPP కార్యాలయాల నిర్మాణాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసం మెరుగైన వసతులతో కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
News October 27, 2025
BWF-2025 తదుపరి టోర్నీలకు పీవీ సింధు దూరం

ఒలింపిక్ బ్యాడ్మింటన్ పతక విజేత PV సింధు ‘BWF TOUR-2025’ తదుపరి ఈవెంట్ల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. యూరోపియన్ లీగ్‌కు ముందు పాదానికి తగిలిన గాయం పూర్తిగా మానకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గాయం కొంత తగ్గినప్పటికీ దీర్ఘకాలిక ఫిట్నెస్, ఆట మెరుగుపడటానికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారన్నారు. 2026 JANలో బ్యాడ్మింటన్ కోర్టులో దిగేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
News October 27, 2025
నిర్మల్: ‘ప్రజా ఫిర్యాదులను పరిష్కరిస్తాం’

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అందజేస్తున్న ఫిర్యాదులను ఫునఃపరిశీలించి తగిన విధంగా పరిష్కార మార్గాలు చూపుతామని అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. గ్రామీణ, పట్టణ స్థాయి, వ్యవసాయ భూముల సంబంధిత దరఖాస్తులు అధికంగా వస్తున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో ఆయా శాఖల సిబ్బంది పనితనం మెరుగుపరచుకోవాలన్నారు.


