News March 26, 2025
NGKL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం, ఏసీలు దగ్ధం

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని పలు ఏసీలు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పి వేసినట్లు జిల్లా ఫైర్ అధికారి కృష్ణమూర్తి తెలిపారు.
Similar News
News March 31, 2025
సిద్దిపేట్: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలి: కిషన్ రెడ్డి

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిపెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా గెలిచిన మల్క కొమురయ్య, అంజిరెడ్డిలను అభినందించారు.
News March 31, 2025
రంజాన్.. HYDలో వీటికి ఫుల్ DEMAND

HYD నగరంలో రంజాన్ పండుగ వేళ బిర్యానీ, క్యాబ్స్, బుకింగ్ ఆటోలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పండగ కావడంతో రెడ్ హిల్స్ లాంటి అనేక ప్రాంతాల్లో ముస్లిం ఆటో డ్రైవర్లు సెలవు తీసుకున్నారు. మరోవైపు పండగ వేళ నగరంలో రద్దీగా ఉండడంతో సాధారణ రోజులతో పోలిస్తే బుకింగ్ ఆటోలకు 20 నుంచి 30 శాతం అధికంగా చార్జీలు పడుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఆన్‌లైన్ ఆర్డర్లతో రెస్టారెంట్లు, హోటల్స్ కిక్కిరిస్తున్నాయి.
News March 31, 2025
సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలి: పల్లా

టీడీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు నడుచుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం అచ్యుతాపురంలో పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఐదేళ్లు కష్టపడి పార్టీని కార్యకర్తలు అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు.