News March 26, 2025
రాష్ట్రంలో నేరాలు 17% తగ్గాయి: డీజీపీ

AP: రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కలెక్టర్ల సదస్సులో తెలిపారు. 2024 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి వరకు అంతకుముందు ఏడాదితో పోల్చితే నేరాలు 17% తగ్గాయని పేర్కొన్నారు. ‘2023 జూన్-2024 JAN మహిళలపై 18,114 నేరాలు జరిగితే 2024 జూన్-2025 JAN వరకు 16,809 నేరాలు జరిగాయి. గంజాయి సాగును 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాలకు తగ్గించగలిగాం’ అని వివరించారు.
Similar News
News March 30, 2025
సంక్రాంతికి పొలిమేర-3: డైరెక్టర్

చిన్న సినిమాలుగా వచ్చి సంచలన విజయం సాధించిన ‘పొలిమేర’ 1&2లకు సీక్వెల్ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ వెల్లడించారు. ‘ఇది పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో ఉంటుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తాం. ఇందులో ఓ ప్రముఖ నటుడు కీలక పాత్రలో నటిస్తారు’ అని చెప్పారు. కాగా ఆయన డైరెక్షన్ చేసిన 28 డిగ్రీస్ మూవీ ఏప్రిల్ 4న విడుదల కానుంది.
News March 30, 2025
కొలికపూడిపై సీఎం ఆగ్రహం?

AP: వరుసగా వివాదాలకు కారణమవుతున్న టీడీపీ ఎమ్మెల్యే <<15917608>>కొలికపూడి శ్రీనివాసరావు<<>> తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం చేసినట్లు సమాచారం. ఎక్కడా లేని సమస్యలు తిరువూరులోనే ఎందుకు వస్తున్నాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, ఎంపీ కేశినేని చిన్నిలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎవరైనా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే పనిచేయాలని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
News March 30, 2025
పరీక్షల భయం.. అమ్మాయి ఆత్మహత్య

వైద్యవిద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష ఒత్తిడి భరించలేక తమిళనాడు చెన్నైకి చెందిన 21 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికే మూడు సార్లు NEETలో ఫెయిల్ అయిన దేవదర్శిని.. మేలో మళ్లీ ఎగ్జామ్ రాసేందుకు ప్రిపేర్ అవుతోంది. తరచూ విఫలం అవుతుండటం, సమయం వృథా కావడం, కుటుంబ ఆర్థిక సమస్యలతో సతమతం అయిన ఆమె ఇవాళ ఉరేసుకుంది.