News March 26, 2025
MDK: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

ఎన్నో నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి వర్గంలోకి 4 లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఉమ్మడి MDK జిల్లా నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వాలని అధిష్టానం భావిస్తోన్నట్లు సమాచారం. మరి మీ కామెంట్..
Similar News
News March 29, 2025
జీవితంలో ఉగాది పచ్చడిలా షడ్రుచులుండాలి: కలెక్టర్

మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్ రాజ్ నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి పండుగలు ఉగాది పండుగతోనే మొదలవుతాయని, శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ జిల్లా ప్రజలందరి జీవితంలో ఉగాది పచ్చడిలా షడ్రుచులు నిండి ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ.. తమ కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
News March 29, 2025
సంగారెడ్డి: ముగ్గురు పిల్లలు మృతి.. భర్త అనుమానమే కారణమా?

SRD జిల్లా అమీన్‌పూర్‌లో ముగ్గురు పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. RR జిల్లా తలకొండపల్లి(M)కి చెందిన చెన్నయ్య 2012లో NLG జిల్లా మందాపూర్ వాసి రజితను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమెపై అనుమానంతో చెన్నయ్య వేధించేవాడు. దీంతో పట్టింటికి వెళ్లింది. పెద్దలు చెప్పడంతో భర్త దగ్గరికి వచ్చింది. మళ్లీ వేధిస్తే పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటానని అప్పట్లోనే రజిత హెచ్చరించినట్లు తెలిసింది.
News March 29, 2025
SRD: ముగ్గురు పిల్లలు మృతి.. ఇప్పుడే ఏం చెప్పలేం: SP

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో <<15910567>>ముగ్గురు పిల్లలు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సంగారెడ్డి ఎస్పీ పారితోష్ పంకజ్ మాట్లాడారు. ‘క్లూస్ టీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి, స్థానికులను ఆరా తీశాం. ఈ ఘటనలో పూర్తి స్థాయిలో ఏం జరిగిందని తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే పిల్లలు ఎలా మృతి చెందారన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడే ఏమీ చెప్పలేం..’ అని వివరాలు వెల్లడించారు.