News March 26, 2025

సిరిసిల్ల: ఏప్రిల్ 11లోపు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముంపు గ్రామాల బాధితులు ఏప్రిల్ 11 లోపు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాలోని అన్నపూర్ణ, శ్రీ రాజరాజేశ్వర జలాశయం కింద ముంపునకు గురైన బాధితులు అప్లయ్ చేసుకోవాలని సూచించారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.

Similar News

News March 30, 2025

నేడు ఆదిలాబాద్‌కు గ్రేట్ ఖలీ

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆదివారం WWE సూపర్ స్టార్ ది గ్రేట్ ఖలీ రానున్నట్లు ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ అధ్యక్షుడు ఆదిత్య తెలిపారు. దక్షిణ భారతదేశ ప్రయాణం ముగించుకొని ఆయన సొంత ఊరికి వెళ్తున్న ఖలీ మార్గమధ్యలో ఆదిలాబాద్‌లోని తన ఇంటికి రానున్నట్లు ఆదిత్య వెల్లడించారు. ఆదివారం ఇక్కడే ఉండి మరుసటి రోజు తిరుగి ప్రయాణం కానున్నట్లు పేర్కొన్నారు. 

News March 30, 2025

HNK: జిల్లా ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు తెలిపన కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ పి.ప్రవీణ్య జిల్లా ప్రజలకు నూతన సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి పండుగలు ఉగాది పండుగతోనే మొదలవుతాయని శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ జిల్లా ప్రజలందరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలన్నారు. ప్రజల జీవితాల్లో విజయాలు, సంపదలు, సంతృప్తి సమృద్ధిగా సమకూరాలని, యువత కొత్త ఆశయాలు, ఆలోచనలతో ముందుకు సాగాలని, జిల్లా ప్రజలందరికీ కొత్త వెలుగు నింపాలని కోరారు.

News March 30, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

error: Content is protected !!