News March 26, 2025

సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ మరోసారి సంచలన కామెంట్స్

image

TG: BRS హయాంలో తనపై PD యాక్ట్ పెట్టినప్పుడు కొందరు BJP నేతలే జైలుకు పంపాలని పోలీసులకు చెప్పారని BJP MLA రాజాసింగ్ ఆరోపించారు. ఇప్పుడూ కొందరు ఎలా వెన్నుపోటు పొడవాలో ఆలోచిస్తున్నారని వాపోయారు. ఇక తాము అధికారంలోకి వస్తే పోలీసులపై చర్యలుంటాయన్న KTR కామెంట్స్‌పై స్పందించారు. అప్పట్లో KTR ఆదేశాలతో రేవంత్‌ను బెడ్రూమ్‌లోకి వెళ్లి అరెస్ట్ చేశారని ఇప్పుడాయన CM అయినా వారిని ఏం చేయలేకపోతున్నట్లు చెప్పారు.

Similar News

News January 9, 2026

నేటి నుంచి WPL.. MI, RCB మధ్య తొలి మ్యాచ్

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL-2026) నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో ఛాంపియన్ టీమ్స్ ముంబై, బెంగళూరు తలపడనున్నాయి. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో 7.30PMకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. MIకి హర్మన్ ప్రీత్, RCBకి స్మృతి మంధాన కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు 3 సీజన్లు జరగగా MI రెండు సార్లు (2023, 25), RCB (2024) ఒకసారి టైటిల్ గెలిచాయి. హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.

News January 9, 2026

అక్రమంగా HT పత్తి విత్తనాల అమ్మకం.. కొంటే నష్టం

image

TG: కొంత మంది దళారులు HT పత్తి విత్తనాలను మహారాష్ట్ర, గుజరాత్‌ల నుంచి తెచ్చి తెలంగాణ సరిహద్దుల్లో రైతులకు అమ్ముతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. HT విత్తనాలు కలుపును తట్టుకొని అధిక దిగుబడినిస్తాయని దళారులు చెబుతున్నారు. అయితే HT విత్తనాలతో కలుపు పెరిగి, అధికంగా నివారణ మందులు వాడాల్సి వస్తుందని, దీని వల్ల పర్యావరణానికి హానితో పాటు ఇతర హైబ్రిడ్ విత్తనాలు కలుషితమవుతాయని మంత్రి తుమ్మల హెచ్చరించారు.

News January 9, 2026

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఈరోజు సాయంత్రానికి శ్రీలంకలో హంబన్‌తోట, బట్టికోల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.