News March 26, 2025
జగన్‌ను కలిసిన ఆళ్ల సతీమణి

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీ అభ్యర్థి ఆళ్ల ఆంజనేయరెడ్డిని అరెస్ట్ చేసి ఒంగోలు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వైసీపీ అధినేత జగన్‌ను ఆంజనేయరెడ్డి సతీమణి సుబ్బమ్మ కలిశారు. పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె జగన్ వద్ద వాపోయారు. పార్టీ అండగా ఉంటుందని జగన్ ఆమెకు భరోసా ఇచ్చారు. మాజీ సీఎంను కలిసిన వారిలో బూచేపల్లి ఫ్యామిలీ, చెవిరెడ్డి ఉన్నారు.
Similar News
News March 29, 2025
సెలవు రోజు కూడా బిల్లులు చెల్లించవచ్చు: ప్రకాశం SE

ప్రకాశం జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టే కేంద్రాలు 30,31వ తేదీల్లో పనిచేస్తాయని జిల్లా విద్యుత్ శాఖ ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులో శనివారం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యం కోసం సెలవు రోజుల్లో కూడా బిల్లు కట్టించుకుంటారని తెలిపారు. కాబట్టి వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరారు. నెలాఖరు అయినా తక్కువ చెల్లింపులు జరిగాయని అన్నారు.
News March 29, 2025
ప్రకాశం: DCO సరెండర్

జిల్లా సహకార అధికారి(DCO)ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా సహకార సంఘం అన్ని విధాలా వెనుకబడి ఉంది. దీనికి తోడు సంబంధిత అధికారి శ్రీనివాసరెడ్డి ఆ శాఖను సమన్వయం చేయటంలో విఫలమయ్యారని తేలింది. ఆ శాఖ ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో కలెక్టర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
News March 29, 2025
ప్రకాశం: మీకూ ఇలాంటి కాల్స్ వచ్చాయా..?

ప్రకాశం జిల్లాలో కాల్స్ చేసి బెదిరించడం ఎక్కువైపోయింది. ఈక్రమంలో SP దామోదర్ ఓ ప్రకటన చేశారు. ACB అధికారులమంటూ వచ్చే కాల్స్‌పై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తప్పు చేశారని.. అరెస్ట్ కాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ప్రజలు, అధికారులను బెదిరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫేక్ ఐడీ కార్డులతోనూ మోసాలు చేస్తుంటారని.. ఎక్కడైనా ఇలా జరిగితే 91211 02266కు వాట్సప్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.