News March 26, 2025

గొల్లాదిలో కొట్లాట.. ఏడుగురుకి గాయాలు

image

బాడంగి మండలం గొల్లాది పోలమ్మ ఆలయం సమీపంలో కామన్నవలస, గొల్లాది గ్రామానికి చెందిన వారి మధ్య మంగళవారం కొట్లాట జరిగినట్లు ఎస్ఐ తారకేశ్వరరావు చెప్పారు. ఆలయం సమీపంలో గొల్లాదికి చెందిన ఈపు ఈశ్వరరావు మేకలు మేపుతుండగా కామన్నవలసకి చెందిన ఆదినారాయణ మేకలు మేపేందుకు వచ్చాడు. వారి మధ్య కొట్లాట జరగడంతో ఇరువర్గాలకు చెందిన ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar News

News January 2, 2026

ఓడీఎఫ్, ఎన్ఆర్ఈజీఎస్ లక్ష్యాల సాధనకు వేగం పెంచాలి: VZM కలెక్టర్

image

టెలికాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం దిశానిర్దేశం చేశారు. ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్ పూర్తయిన గ్రామాలను వెంటనే డిక్లేర్ చేయాలని, ఇప్పటికే డిక్లేర్ చేసిన గ్రామాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద రోజుకు 47 వేల మాన్‌డేస్ లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలన్నారు.

News January 2, 2026

VZM: ఒక్కరోజే రూ.7.76 కోట్ల మద్యం ఫుల్‌గా తాగేశారు

image

విజయనగరం జిల్లాలో ఆబ్కారీ ఆదాయానికి 2026 సంవత్సరం ప్రారంభ రోజే కొత్త కిక్కునిచ్చింది. డిసెంబర్ 31న మందు బాబులు ఫుల్ జోష్ చేసుకున్నారు. ఏకంగా జిల్లాలో రూ.7.76 కోట్లు విలువ చేసే మద్యాన్ని తాగేశారు. గత ఏడాది రూ.5.27 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.2.50 కోట్ల ఆదాయం పెరిగింది. డిసెంబర్ 31న వైన్, బార్ అండ్ రెస్టారెంట్స్‌లో అమ్మకాలకు 2 గంటల వరకు అదనంగా అనుమతులు ఇచ్చారు.

News January 2, 2026

విశాఖ రేంజ్ ఐజీతో విజయనగరం ఎస్పీ భేటీ

image

విశాఖపట్నం రేంజ్ డీఐజీగా ఉన్న గోపినాథ్ జట్టి.. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయనగరం ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ రేంజ్ కార్యాలయంలో ఐజీని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేసి నూతన సంవత్సరం, పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తామని ఐజీ గోపినాథ్ జట్టి పేర్కొన్నారు.