News March 26, 2025
సీఎం రేవంత్ హుజూర్‌నగర్ పర్యటన షెడ్యూల్

HNRలో ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలను మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 5.45కు HNR రామస్వామి గుట్టలో డబల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలిస్తారు. 6.15కి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 6.15 నుంచి 7.30 వరకు సన్న బియ్యం పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. 7.30 తిరిగి హైదరాబాద్ పయనమవుతారు. సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Similar News
News July 9, 2025
మార్కెట్‌లో ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్.. అదేంటంటే?

మీకు పెళ్లిళ్లకు వెళ్లి ఎంజాయ్ చేయడమంటే ఇష్టమా? అయితే తెలియని వారి పెళ్లిలో కొత్తవారితో సరదాగా గడిపే ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ, నోయిడా నగరాల్లో ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్ నడుస్తోంది. నిర్వాహకులు ఏర్పాటు చేసే ఈ ఫేక్ పెళ్లిలో వధువు, వరుడు ఉండరు. కానీ, అన్ని వేడుకలు, వివాహ భోజనం, బరాత్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో రూ.1499 చెల్లించి టికెట్ కొనొచ్చు. ఈ ట్రెండ్ గురించి చర్చ జరుగుతోంది.
News July 9, 2025
ప్రజలకు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ముఖ్య గమనిక

ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డులో వివరాలు, బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో ఎస్పీ మహేశ్ బి గీతేతో కలిసి జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించి మాట్లాడారు. పౌరులందరికీ తప్పనిసరిగా ఆధార్ కార్డును జారీ చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News July 9, 2025
వేములవాడ: ప్రభుత్వ ఆస్పత్రిలో మాక్ డ్రిల్

అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బందిలో అప్రమత్తత పెంచేందుకు అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే ఎలా స్పందించాలి, రోగులను ఎలా సురక్షితంగా తరలించాలి, ఎమర్జెన్సీ సిగ్నల్స్‌ను ఎలా ఉపయోగించాలని ప్రాక్టికల్ డెమో నిర్వహించారు.