News March 25, 2024
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు. ఆ తర్వాత సొంత పార్టీ పరాజయాల అనంతరం బీజేపీలో చేరారు.
Similar News
News March 16, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారు వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,670
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,416
* వెండి 10 గ్రాముల ధర రూ.2585.
News March 16, 2026
కడప: ఓపెన్ 10th పరీక్షలకు 388 విద్యార్థులు డుమ్మా.!

కడప జిల్లాలో సోమవారం 31 సెంటర్లలో ఓపెన్ 10th పరీక్షలను నిర్వహించారు. నేటి పరీక్షలకు 389 మంది విద్యార్థులు డుమ్మా కొట్టారు. 2261 మంది విద్యార్థులు తెలుగు పరీక్ష రాయాల్సి ఉండగా.. 1875 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉర్దూ పరీక్షకు 63 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 61 మంది పరీక్షలు రాశారు. జిల్లాలో రెగ్యులర్ 10th పరీక్షలు 167 సెంటర్లలో జరిగాయి. 27,838(100%) మంది విద్యార్థులు హాజరయ్యారు.
News March 16, 2026
కడప: పదో తరగతి ఎగ్జాం రూములోకి పాము

కడప జిల్లా బి.కోడూరులో పదో తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. స్థానికంగా ఉన్న ఓ పరీక్షా కేంద్రంలోని రూములోకి పాము వచ్చింది. విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్కూల్ సిబ్బంది పామును చంపి బయట వేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు వెళ్లారు.


