News March 26, 2025
బీఆర్ఎస్ చేసిన అతి పెద్ద స్కామ్ ‘మన ఊరు-మన బడి’: అక్బరుద్దీన్

TG: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం కాళేశ్వరం కంటే పెద్ద కుంభకోణమని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ‘బీఆర్ఎస్ చేసిన మిగతా స్కామ్స్ అన్నీ చాలా చిన్నవి. మన ఊరు-మన బడి కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపించాలి. 4823 ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు లేవు. బాలికలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
Similar News
News March 29, 2025
త్రిష ప్రేమ పెళ్లి చేసుకోనున్నారా?

41 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో అదరగొడుతున్న హీరోయిన్ త్రిష పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇవాళ ఆమె ఇన్‌స్టాలో నగలు, పట్టుచీరతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘ప్రేమ ఎప్పుడూ విజయం సాధిస్తుంది’ అని రాసుకొచ్చారు. దీనికి సఖి చిత్రంలోని ‘స్నేహితుడా’ పాట BGMను యాడ్ చేశారు. దీంతో ఆమె ఫ్రెండ్‌ను ప్రేమ వివాహం చేసుకుంటున్నారా? అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News March 29, 2025
దేశ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వసంతకాలంలో జరుపుకునే ఈ నూతన సంవత్సర పండుగ దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రజలంతా సామరస్యం, సమగ్రతను చాటి దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని రాష్ట్రపతి కోరారు. ఉగాదిని వివిధ పేర్లతో దేశంలోని పలు రాష్ట్రాలు జరుపుకుంటాయి.
News March 29, 2025
భూకంపం.. 1644 మంది మృతి

మయన్మార్ భూకంప మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 1644 మంది మరణించారని ఆ దేశ అధికారులు వెల్లడించారు. వేలాది మందికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. కాగా మృతుల్లో భారతీయులు ఎవరూ లేరని భారత విదేశాంగ శాఖ తెలిపింది.