News March 26, 2025
IPL: రషీద్ ఖాన్ ఖాతాలో మరో మైలురాయి

IPLలో అతి తక్కువ మ్యాచుల్లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్న బౌలర్ల జాబితాలో GT స్పిన్నర్ రషీద్ ఖాన్ మూడో స్థానంలో నిలిచారు. 122 మ్యాచుల్లో ఆయన ఈ ఘనతను సాధించారు. తొలి రెండు స్థానాల్లో మలింగా (105), చాహల్ (118) ఉన్నారు. 4, 5, 6 స్థానాల్లో బుమ్రా (124), బ్రావో (137), భువనేశ్వర్ కొనసాగుతున్నారు. ఇక అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో చాహల్ (205) టాప్లో ఉండగా, రషీద్ 11వ స్థానానికి చేరారు.
Similar News
News March 29, 2025
దేశ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వసంతకాలంలో జరుపుకునే ఈ నూతన సంవత్సర పండుగ దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రజలంతా సామరస్యం, సమగ్రతను చాటి దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని రాష్ట్రపతి కోరారు. ఉగాదిని వివిధ పేర్లతో దేశంలోని పలు రాష్ట్రాలు జరుపుకుంటాయి.
News March 29, 2025
భూకంపం.. 1644 మంది మృతి

మయన్మార్ భూకంప మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 1644 మంది మరణించారని ఆ దేశ అధికారులు వెల్లడించారు. వేలాది మందికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. కాగా మృతుల్లో భారతీయులు ఎవరూ లేరని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
News March 29, 2025
రేపు, ఎల్లుండి పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

TG: రేపు, ఎల్లుండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. LRS ఫీజు మార్చి31లోపు చెల్లించిన వారికి 25శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్టేషన్ శాఖ తొలుత ప్రకటించింది. అయితే 30, 31 సెలవుదినాలు కావడంతో చెల్లింపులు జరపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సెలవులను రద్దు చేసింది.