News March 26, 2025
భార్యాభర్తల మధ్య వివాదం.. రెండేళ్ల కూతురి మృతి

కుటుంబ కలహాలతో రెండేళ్ల కూతురితో కలిసి మహిళ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వత్సవాయి (మం) కన్నెవీడులో చోటుచేసుకుంది. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రాత్రి మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో మనస్తాపనికి గురైన మహిళ బిడ్డతో ఇంటి నుంచి గ్రామ శివారులో బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రెండేళ్ల శ్రావణి మృతిచెందగా తల్లికి గాయాలయ్యాయి.
Similar News
News March 29, 2025
ప్రకాశం జిల్లా వాసులకు శుభాకాంక్షలు తెలిపిన CM

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండంచర్లలో శనివారం శ్రీ గంగా భవాని సమేత వేణుతల కాటమరాజు తిరునాళ్ల సందర్భంగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. కాటమరాజు కరుణతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ శాంతులతో సిరిసంపదలతో కలకాలం ఉండాలని, ఆకాంక్షిస్తున్నట్లు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
News March 29, 2025
ఈ ఉగాది, రంజాన్ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: ఎస్పీ

జిల్లా ప్రజలకు తెలుగు నూతన సంవత్సరము ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగను ముస్లిం సోదర, సోదరీమణులందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. అల్లాహ్ దీవెనలతో జిల్లా ప్రజలకు సకలశుభాలు కలగాలని పేర్కొన్నారు.
News March 29, 2025
మెదక్ ప్రజలకు ఎస్పీ ఉగాది, రంజాన్ విషెస్

మెదక్ జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులకు తెలుగు సంవత్సరాది ఉగాది, రంజాన్ పండగ శుభాకాంక్షలను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో తీపి చేదు షడ్రుచుల కలగలిపి ఆస్వాదిస్తూ శాంతి సౌభాగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగ, ముస్లింలు పవిత్ర మాసం రంజాన్ పండగలు ఏకకాలంలో వస్తున్నందున కులమతాలు వేరైనా మనమందరం భారతీయులమన్న విషయం మర్చిపోవద్దన్నారు.