News March 26, 2025

బాపట్ల: పిల్లలకు ఒంటిపూట బడులు.. తల్లిదండ్రులు జాగ్రత్త 

image

బాపట్ల గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ఈత ఒక సరదా. కానీ అదే ఈత పసిప్రాణాలను హరించేస్తోంది. ఏటా ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీని పర్యవసానంగా పలు కుటుంబాల్లో విషాదం అలముకుంటోంది. వేసవిలో ఒక పూట బడులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు సరదాకు ఈతకు వెళ్తున్నారు. అవి ఎక్కువ లోతు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల తమ పిల్లలపై ఒక కన్ను వేసి ఉంచాలని అధికారులు కోరుతున్నారు.

Similar News

News March 31, 2025

JRG: శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

image

బైక్‌పై రాజమండ్రిలోని అత్తారింటికి శుభకార్యానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. లక్కవరానికి చెందిన నాగేశ్వరరావు(45) తన భార్య రమణమ్మ, కొడుకు షణ్ముఖ్, కుతూరు జాహ్నవితో కలిసి బైక్‌పై బయలుదేరారు. సీతంపేట వద్ద రోడ్డు అంచున ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో వీరనాగేశ్వరరావు మృతి చెందారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI చంద్రశేఖర్ తెలిపారు.

News March 31, 2025

NLG: వ్యవసాయశాఖలో కొత్త ఫోన్ నంబర్లు

image

నల్గొండ జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫోన్ నంబర్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని JDA శ్రవణ్ కుమార్ తెలిపారు.
☞జిల్లా వ్యవసాయధికారి – 8977751294
☞NLG ADA–T(DAO) – 8977751295
☞NLG ADA – 8977751449
☞DVK ADA – 8977751306
☞MLG ADA – 8977751358
☞హాలియా ADA -8977751330
☞మునుగోడు ADA – 8977751370
☞నకిరేకల్ ADA – 8977751427
☞DDAFTC నల్గొండ – 8977751458

News March 31, 2025

తూప్రాన్: గ్రూపు-1లో 17వ ర్యాంకు

image

తూప్రాన్ పట్టణానికి చెందిన బోయినిపల్లి ప్రణయ సాయి ఆదివారం ప్రకటించిన ర్యాంకుల్లో గ్రూపు -1లో 513 మార్కులతో రాష్ట్రస్థాయి 17వ ర్యాంకు సాధించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు విష్ణువర్ధన్, శ్రీవిద్య దంపతుల కుమారుడైన ప్రణయ్ సాయి గ్రూపు-lV ఫలితాల్లో 42 ర్యాంకు సాధించి చేగుంట రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్ -llలో 134, గ్రూపు -lllలో 148 ర్యాంకు సాధించాడు.

error: Content is protected !!