News March 26, 2025

నా ఫొటోలను మార్ఫింగ్ చేశారు: గద్వాల MLA

image

తాను <<15888413>>BRSలోనే ఉన్నానని<<>> గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని వారు మోసపూరితంగా ఫొటోలు మార్ఫింగ్ చేసి మీడియాకు విడుదల చేశారని అన్నారు. కాంగ్రెస్‌లో తాను చేరానని ప్రచారం చేయడంతో ప్రజల్లో అయోమయం నెలకొనే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే మీడియాలో వచ్చిన కథనాలపై 2025, FEB 11న గద్వాల PSలో ఫిర్యాదు చేయగా FIR కూడా నమోదైందన్నారు.

Similar News

News December 28, 2025

MBNR: SSC, INTER.. అప్లై చేసుకోండి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరెందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ స్కూల్ (TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య “Way2News” ప్రతినిధితో తెలిపారు. వచ్చేనెల 5లోగా.. ఫైన్‌తో 16లోగా అప్లై చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. www.telanganaopenschool.org వెబ్ సైట్ సందర్శించాలన్నారు. SHARE IT

News December 28, 2025

ALERT: చైనా మాంజా.. సమాచారం ఇవ్వండి: SP

image

ప్రజల ప్రాణాల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని, చైనా మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా కఠిన చర్యలు చేపడుతున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించి చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా మానేయాలని, ఎవరైనా చైనా మాంజా అమ్ముతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.

News December 28, 2025

MBNR: U-14..హ్యాండ్ బాల్ జట్టు ఎంపిక

image

MBNRలోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అండర్-14 బాల, బాలికలకు హ్యాండ్ బాల్ జట్టు ఎంపికలు నిర్వహించారు. మొత్తం 70 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన వారు నారాయణపేటలో నేటి నుంచి ప్రారంభమయ్యే రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు హాజరవుతున్నట్లు SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి తెలిపారు.పీడీలు వేణుగోపాల్, రవి, శంకర్, జియావుద్దీన్,గనేశ్వరి పాల్గొన్నారు.