News March 26, 2025
నా ఫొటోలను మార్ఫింగ్ చేశారు: గద్వాల MLA

తాను << 15888413>>BRSలోనే ఉన్నానని<<>> గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని వారు మోసపూరితంగా ఫొటోలు మార్ఫింగ్ చేసి మీడియాకు విడుదల చేశారని అన్నారు. కాంగ్రెస్‌లో తాను చేరానని ప్రచారం చేయడంతో ప్రజల్లో అయోమయం నెలకొనే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే మీడియాలో వచ్చిన కథనాలపై 2025, FEB 11న గద్వాల PSలో ఫిర్యాదు చేయగా FIR కూడా నమోదైందన్నారు.
Similar News
News February 23, 2026
తడికలపూడి వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీ

కామవరపుకోట మండలం తడికలపూడి శివారులో ఆదివారం సాయంత్రం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులలో ఒకరు కామవరపుకోట, మరొకరు మచిలీపట్నం ప్రాంతానికి చెందిన వారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి, ఏలూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 23, 2026
వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. టెన్నిస్‌లో సంచలనం

ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్(ITF) W100 టోర్నీ(బెంగళూరు) రన్నరప్‌గా నిలిచిన ప్లేయర్ వైష్ణవి అడ్కర్‌పై ప్రశంసలొస్తున్నాయి. 2009లో సానియా మీర్జా తర్వాత WTA 100 సింగిల్స్ ఫైనల్ చేరిన తొలి భారత మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. పుణేకి చెందిన 21 ఏళ్ల వైష్ణవి ఈ టోర్నీలో వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చారు. అద్భుతంగా ఆడుతూ ఫైనల్‌కు చేరారు. కానీ ఫైనల్‌లో హన్నే వాండేవింకెల్(బెల్జియం) చేతిలో ఓడారు.
News February 23, 2026
రాజంపేట: ఇంటర్ విద్యార్థికి యాక్సిడెంట్

పరీక్ష రాయాల్సిన విద్యార్థి ఆసుపత్రి పాలైన ఘటన ఇది. రాజంపేట డివిజన్ పిచ్చిగుంట్లపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థికి వీరబల్లిలో పరీక్షా కేంద్రం కేటాయించారు. ఇవాళ ఉదయం తన ఇంటి నుంచి బైకుపై పరీక్షా కేంద్రానికి బయల్దేరాడు. నీలవాండ్లపల్లి సమీపంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టి వెళ్లిపోయింది. రోడ్డుపై తీవ్ర గాయాలతో ఉన్న విద్యార్థిని గుర్తించి రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


