News March 26, 2025
శ్రీశైలానికి కన్నడిగుల సాహస యాత్ర

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది కన్నడిగులు పాదయాత్రతో శ్రీశైలం చేరుకుంటున్నారు. వందల కిలోమీటర్ల నుంచి వస్తూ ఆత్మకూరు సమీపంలో కాళ్లకు కర్రలు కట్టుకొని దట్టమైన నల్లమల అడవులలో సాహస యాత్రను చేపడుతున్నారు. వారి పాదయాత్రను చూసి స్థానిక ప్రజలు కన్నడిగుల భక్తికి ఇదే నిదర్శనమని పేర్కొంటున్నారు. కాగా ఈ నెల 31 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి.
Similar News
News April 1, 2025
కర్నూలు: పరీక్షా కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు నగరంలోని దామోదరం సంజీవయ్య, స్మారక మున్సిపల్ హై స్కూల్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కల్పించడంలో అధికారులు సఫలమయ్యారని అన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చూసుకోవాలని ఆదేశించారు.
News April 1, 2025
కర్నూలు జిల్లాలో 54.35% పింఛన్ల పంపిణీ@9Am.!

కర్నూలు జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి మంగళవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం ఆదేశాలతో ఉదయం 7 గంటల నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. ఉదయం 9 గంటలకు జిల్లాలో 54.35% పింఛన్ల పంపిణీ పూర్తయింది. ఇప్పటివరకు జిల్లాలో 2,38,302 మందికి గానూ 1,29,522 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు.
News April 1, 2025
కర్నూలు జిల్లాలో 9 కరవు మండలాలు.!

రబీ సీజన్‌లో ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల జాబితాలో కర్నూలు జిల్లాలో 9 మండలాలకు స్థానం లభించింది. 2024-25 రబీ సీజన్‌లో కరవు ప్రభావిత మండలాలను సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఆస్పిరి, కల్లూరు, కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్, మద్దికెర, ఓర్వకల్లు, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి మండలాలను తీవ్ర కరవు ప్రాంతంగా గుర్తించింది. మిగిలిన మండలాలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.