News March 26, 2025

భారతీయులకు బంపరాఫర్.. విమాన టికెట్లపై 30 శాతం డిస్కౌంట్

image

యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారతీయుల కోసం బంపరాఫర్ ప్రకటించింది. సమ్మర్‌లో తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే ఇండియన్స్‌కు 30 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఫ్రాన్స్, టర్కీ, స్పెయిన్, ప్రాగ్, గ్రీస్, వార్సా రూట్లలో ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ నెల 28లోగా బుక్ చేసుకున్నవారు ఈ ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించవచ్చని వెల్లడించింది.

Similar News

News April 1, 2025

విద్యార్థినులను దుర్భాషలాడిన ప్రిన్సిపల్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

image

TG: వికారాబాద్‌లో ఓ ప్రిన్సిపల్ గురుకుల విద్యార్థినులను అసభ్య పదజాలం వాడుతూ కొట్టడంపై <>BRS నేత ప్రవీణ్ కుమార్<<>> తీవ్రంగా స్పందించారు. ‘గురుకులాల్లో పిల్లలను ఇలాగే పెంచుతారా?. విద్యార్థినులను లేకి ము**, దొంగ ము** అని తిడతారా? మీ పిల్లలను ఇలాగే దండిస్తారా?’ అని నిలదీశారు. పిల్లలు తప్పు చేస్తే వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ను కోరారు.

News April 1, 2025

మహిళపై గ్యాంగ్ రేప్.. సంచలన విషయాలు

image

TG: నాగర్ కర్నూల్ జిల్లాలో <<15944914>>మహిళపై గ్యాంగ్ రేప్<<>> ఘటనలో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఏడుగురు ఈ దారుణానికి ఒడిగట్టగా, దాదాపు 3 గంటలపాటు ఆమెను లైంగికంగా వేధించినట్లు చెప్పారు. దాహం వేస్తోందని బాధితురాలు మంచినీరు అడగగా మానవత్వం మరిచి నోట్లో మూత్రం పోసినట్లు తెలిపారు. కాగా నిన్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వీరికి సహకరించిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

News April 1, 2025

స్టాక్ మార్కెట్స్ క్రాష్

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎరుపెక్కాయి. కొత్త ఫైనాన్షియల్ ఇయర్‌ ఆరంభంలోనే బేర్ పంజా విసిరింది. సెన్సెక్స్ 1160 పాయింట్ల భారీ నష్టంతో 76,220 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 273Pts కోల్పోయి 23,246 వద్ద కొనసాగుతోంది. Bajaj finserv, infosys, HDFC బ్యాంక్, Sriram, Bajaj finance షేర్లు భారీగా పడిపోయాయి.

error: Content is protected !!