News March 25, 2024

పెద్దశంకరంపేట: నీట మునిగి గొర్రెల కాపరి మృతి

image

పెద్ద శంకరంపేట మండలం కొప్పల్ శ్రీ ఉమా సంగమేశ్వర ఆలయ సమీపంలో నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో నీట మునిగి గొర్రెల కాపరి చౌదరిపల్లి రాజు(32) మృతి చెందాడు. నాగల్‌గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన రాజు గొర్రెలు మేపడానికి నిన్న నిజాంసాగర్ వైపు వచ్చాడు. బ్యాక్ నీళ్లలో ఈత కోసం వెళ్లి గల్లంతయ్యాడు. ఈరోజు మృతుడి శవాన్ని బయటకు తీయగా.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News July 8, 2024

సంగారెడ్డి: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

image

కరెంటు షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన సిర్గాపూర్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. అంతర్గాంకు చెందిన సుభాష్(30) ఆదివారం చేపలు పట్టేందుకు స్థానిక వాగుకు వెళ్లాడు. ఎప్పటి లాగానే కరెంట్ షాక్ ద్వారా చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి సుభాష్ మృతి చెందాడు. ఈమేరకు మృతుడి తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ మైపాల్ రెడ్డి తెలిపారు.

News July 8, 2024

పటాన్‌చెరు: ED పేరుతో.. రూ.3లక్షలు స్వాహా

image

పటాన్‌చెరు మండలం లక్డారం వాసికి జులై 1న ఓ వ్యక్తి ఈడి కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి మనీ లాండరింగ్ కేసు నమోదు అయ్యిందని బెదిరించాడు. విచారిస్తున్నామని ఆధార్, బ్యాంకు వివరాలు తెలపాలన్నారు. ఈ క్రమంలో ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్పడంతో రూ.3 లక్షలు ఖాతా నుంచి మాయమయ్యాయి. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

News July 8, 2024

SRD: ఇన్స్పైర్ మనక్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఇన్స్పైర్ మనక్ కార్యక్రమం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి సిధారెడ్డి తెలిపారు. జిల్లా విద్యాశాఖ నుంచి ప్రతి పాఠశాలకు పంపే ప్రత్యెక లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దీనిపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని, సెప్టెంబర్ 15 చివరి తేదని తెలిపారు.