News March 26, 2025
సికింద్రాబాద్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

సికింద్రాబాద్ మహంకాళి PS పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం.. వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. స్పాట్ వద్ద సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Similar News
News April 1, 2025
TODAY HEADLINES

✒ మయన్మార్: 2వేలకు చేరిన భూకంప మృతుల సంఖ్య
✒ YCP మంత్రిని బీటెక్ రవి, బీద రవి తన్నారు: లోకేశ్
✒ రేపటి నుంచి మరో ఉచిత సిలిండర్: నాదెండ్ల
✒ అన్యాయాలను ప్రశ్నిస్తే చంపేస్తారా?: YS జగన్
✒ గుండె సమస్య.. ముంబైకి కొడాలి నాని తరలింపు
✒ కాకినాడ పోర్టు నుంచి TG బియ్యం ఎగుమతులు
✒ ‘రాజీవ్ యువ వికాసం’ గడువు APR 14 వరకు పొడిగింపు
✒ SRHకు HCA వేధింపులు.. సీఎం రేవంత్ ఆగ్రహం
✒ HCU భూములపై ముదురుతున్న వివాదం
News April 1, 2025
రామ్ చరణ్ ‘పెద్ది’ ఆడియో హక్కుల ధర ఎంతంటే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న మూవీ- ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో మూవీకి మంచి బజ్ నెలకొనగా మూవీ టీమ్ తాజాగా మరో క్రేజీ న్యూస్ చెప్పింది. ఏఆర్ రెహమాన్ అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్‌ను టీ-సిరీస్ రూ.35కోట్లకు దక్కించుకుందని ప్రకటించింది. రెహమాన్-చెర్రీ కాంబోలో ఇదే తొలిమూవీ కావడం విశేషం.
News April 1, 2025
ఆరుబయట పడుకుంటున్నారా?

వేసవి కారణంగా చాలామంది ఆరుబయటో, మేడపైనో పడుకుంటుంటారు. ఒకప్పుడైతే వేసవినాటికి దోమలు పోయేవి. కానీ నేడు విషజ్వరాలను కలిగించే దోమల సంతతి వేసవిలోనూ ఉంటోంది. ఈ నేపథ్యంలో బయట పడుకునేవారు కచ్చితంగా దోమల తెరను వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే చోటుకు కొంచెం దూరంలో సాంబ్రాణి ధూపం వేస్తే ఆ వాసనకు దోమలు దూరంగా ఉంటాయంటున్నారు. కాళ్లకు చేతులకు నూనె రాసుకున్నా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.