News March 26, 2025
చిత్తూరు జిల్లాలో భయపెడుతున్న భానుడు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉ.11కే భానుడు దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఠారెత్తిస్తున్నాడు. మంగళవారం తవణంపల్లెలో దాదాపు 40, గంగవరంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చిత్తూరులో 38, నగరిలో 37, పలమనేరులో 37.5, కుప్పంలో 33.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మీ ప్రాంతంలో కూడా ఇలానే ఉంటే కామెంట్ చేయండి.
Similar News
News March 31, 2025
మొగిలి సమీపంలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

బంగారుపాళ్యం మండలం మొగిలి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తవణంపల్లె మండలం పైమాఘానికి చెందిన రాజేశ్వరి తన భర్తతో కలిసి మొగిలీశ్వర స్వామి గుడికి బైకుపై వచ్చారు. తిరిగి వెళ్తుండగా గొల్లపల్లి సమీపంలో రోడ్డు దాటుతుండగా ఓ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజేశ్వరికి అక్కడికక్కడే చనిపోగా.. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి.
News March 31, 2025
చిత్తూరు: శ్రీవారి భక్తుడు మృతి

ఈ నెల 24న తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లోని టాయిలెట్‌లో కాలు జారిపడిన శ్రీవారి భక్తుడిని అధికారులు రూయ ఆసుపత్రిలో చేర్పించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ భక్తుడు ఆదివారం మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఒంగోలుకు చెందిన వీరాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అలిపిరి ఎస్సై అజిత కేసు నమోదు చేశారు.
News March 30, 2025
మసీదుల వద్ద పటిష్ఠ భద్రత: చిత్తూరు జిల్లా ఎస్పీ

రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలు పాటిస్తూ ముస్లిం సోదరులు సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగను ప్రేమ, శాంతి, సౌహార్దంతో జరుపుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు కోరారు. అనంతరం మసీదుల వద్ద పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, ప్రజలు ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.