News March 26, 2025
విశాఖ అభివృద్ధిపై కలెక్టర్ నివేదిక.. అంశాలివే..!

➤ 98 ఎకరాల్లో 5 సోలార్ ప్లాంట్లు, 100 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
➤ ట్రాఫిక్ నియంత్రణకు 72.82 కి.మీ. పొడవున 15 రహదారులు జూన్ నాటికి పూర్తి
➤ జీవీఎంసీ పరిధిలో ఐదు చోట్ల వర్కింగ్ విమెన్ హాస్టల్స్
➤ పరదేశిపాలెంలో రూ.70లక్షలతో కాలేజీ అమ్మాయిలకు హాస్టల్ భవనం నిర్మాణం
➤ రూ.కోటితో కేజీహెచ్ ఓపీ, క్యాజువాలటీ ఆధునీకరణ
➤ విశాఖ పోర్టులో క్రూయిజ్ టూరిజం ప్రారంభం
➤ బీచ్‌లో హోప్ ఆన్, హోప్ ఆఫ్ బస్సు సర్వీసులు
Similar News
News September 13, 2025
విశాఖ చేరుకున్న జేపీ నడ్డా

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో జగత్ ప్రకాష్ నడ్డాకు శనివారం ఘన స్వాగతం లభించింది. రేపు జరగనున్న సారథ్యం బహిరంగ సభలో పాల్గొనడానికి ఆయన నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలిసి అనకాపల్లి ఎంపీ సీఎం.రమేశ్ పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు.
News September 13, 2025
విశాఖ: లోక్ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారం

విశాఖ జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 124 మోటార్ ప్రమాద కేసులు పరిష్కరించారు. నష్టపరిహారం రూ.4,40,04750 అందజేశారు. 155 సివిల్ కేసులు, 10,190 క్రిమినల్ కేసులు, 239 ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ చేశారు. రాజీ మొత్తం రూ.25 కోట్లుగా చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు చిన్నంశెట్టి రాజు లోక్ అదాలత్‌ని పర్యవేక్షించారు.
News September 13, 2025
విశాఖలో 15 రోజులపాటు HIV/AIDSపై అవగాహన

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 15 రోజులపాటు విశాఖ జిల్లా పాఠశాలల్లో విద్యార్థులకు HIV/AIDS, లైంగిక వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఐఈసీ కాంపెయిన్ల ద్వారా జాగ్రత్తలు, చికిత్సా అవకాశాలు, గర్భిణులకు కౌన్సెలింగ్, హెల్ప్‌లైన్ 1097 సేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎ.నాగేశ్వరరావు తెలిపారు.