News March 25, 2024
సందేశ్‌ఖాలీ బాధితురాలికి బీజేపీ ఎంపీ టికెట్

ప.బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. ‘సందేశ్‌ఖాలీ’ వివాదంలో బాధిత మహిళ రేఖా పత్రాను బసిర్‌హట్ MP అభ్యర్థిగా BJP నిలబెట్టింది. ఈ పార్లమెంట్ పరిధిలోనే ఆ గ్రామం ఉంది. ఇటీవల అధికార TMC పార్టీకి చెందిన షాజహాన్ షేక్ మహిళలపై అకృత్యాలకు పాల్పడటంతో పాటు భూముల లాక్కుంటున్నట్లు వచ్చిన ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై బాధితురాలు రేఖా ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News September 19, 2025
కండువా కప్పుకుంటే పార్టీ మారినట్లేనా: రేవంత్

ఒక ప్రజా ప్రతినిధి మరొక పార్టీ జెండా కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కాసేపటి క్రితం నేను కూడా కొందరికి కండువాలు కప్పాను. ఆ కండువా ఏంటో కూడా వాళ్ళు చూసుకోకుండా కప్పించుకున్నారు’ అని ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో ఉదహరించారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు లేవని తెలిపారు. BRS ఫిర్యాదుపై స్పీకర్‌దే తుది నిర్ణయమన్నారు.
News September 19, 2025
ఈనెల 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించలేం: CM రేవంత్

TG: SEP 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో CM రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎప్పుడు నిర్వహించాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈనెల 30లోపు నిర్వహించాలంటూ HC ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను HCకి వివరించి, ఏం చేయాలో కోరుతామన్నారు. CM వ్యాఖ్యలను బట్టి ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనని స్పష్టమవుతోంది.
News September 19, 2025
BREAKING: జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ యాడ్ షూటింగ్‌లో తారక్ స్వల్పంగా గాయపడ్డట్లు ఆయన టీమ్ తెలిపింది. రెండు వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకుంటారని చెప్పింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.