News March 26, 2025
నల్లజర్ల : శిశువు మృతి

నల్లజర్ల ముళ్ల పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును కుక్కలు పీకుతుండగా.. స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే శిశువు చికిత్స పొందుతూ రా.12 గం.లకు మరణించిందని సీడీపీఓ నాగలక్ష్మి తెలిపారు. ఘటనపై FIR చేయించామని, వివరాల సేకరణకు అంగనవాడీ సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు.
Similar News
News November 9, 2025
OTTల్లోకి మూడు రోజుల్లో 4 సినిమాలు

ఈ నెల 14-16 వరకు మూడు రోజుల వ్యవధిలో నాలుగు కొత్త సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘తెలుసు కదా’, ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్యూడ్’, ధ్రువ్ విక్రమ్ ‘బైసన్’ మూవీలు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 14న స్ట్రీమింగ్ కానున్నాయి. రష్మిక, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘థామా’ ఈ నెల 16న ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.
News November 9, 2025
విశాఖ: మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

విశాఖలో ఓ వివాహిత శనివారం ఆత్మహత్య చేసుకుంది. గోపాలపట్నం పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మినగర్‌కు చెందిన టి.రమ ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. ఎన్నిసార్లు నచ్చజెప్పినా మారలేదు. దీంతో మనస్తాపం చెంది శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని చనిపోయింది. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 9, 2025
పాలలో వెన్నశాతం పెరగాలంటే?(1/2)

పశువులకు ఇచ్చే దాణాలో కొబ్బరి చెక్క, పత్తి గింజల చెక్క, వేరుశనగ చెక్క, సోయాగింజల చెక్క, పొద్దు తిరుగుడు చెక్క వంటివి ఇవ్వాలి. పశువులకు అందించే మేతలో 1/3వ వంతు ఎండు గడ్డి ఉండాలి. పప్పు జాతి గ్రాసాలైన లూసర్న్, పిల్లి పెసర, జనుము తదితర వాటిని గడ్డి జాతి గ్రాసాలతో కలిపి ఇవ్వాలి. పశుగ్రాసాలను చాప్ కట్టర్ ద్వారా చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి ఇవ్వాలి. దాణాను వీలైనంత వరకు నానబెట్టి పశువుకు ఇవ్వాలి.


