News March 26, 2025
టేకులపల్లిలో వడదెబ్బకు రైతు మృతి

వడదెబ్బతో రైతు మృతి చెందిన ఘటన టేకులపల్లి మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మద్రాస్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో గల కొండంగుల బోడుకి చెందిన కేలోతు గోబ్రియా అనే రైతు వడదెబ్బతో మృతి చెందారు. ఆయన సోమవారం తన పొలంలో పండించిన కూరగాయలు, నువ్వులు కోయడానికి వెళ్లి ఎండ దెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద మృతి చెందాడు.
Similar News
News January 14, 2026
ఫ్యూచర్ సిటీలో సీఎం ‘నిశ్శబ్ద విప్లవం’

సిటీ అంటే హారన్ల గోల. కానీ ఫ్యూచర్ సిటీలో పక్షుల కిలకిలారావాలు వినొచ్చు. ఇది CM స్వయంగా దావోస్‌లో ప్రపంచానికి పరిచయం చేయబోతున్న శబ్దంలేని అద్భుతం. ఫ్యూచర్ సిటీని ఇండియాలోనే మొదటి ‘సైలెన్స్ జోన్’ నగరంగా మార్చే బ్లూప్రింట్ రెడీ అయింది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ జోన్లలో ‘నాయిస్ అబ్జార్బ్‌షన్ రోడ్లు’ వేయబోతున్నారు. అనవసరంగా హారన్ కొడితే AI డిటెక్టర్లతో నం. ప్లేట్ స్కాన్ అయ్యి చలాన్ జనరేట్ అవుతుంది.
News January 14, 2026
మేడారం గద్దెల వద్ద ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు..!

మేడారం మహా జాతరలో సమ్మక్క, సారలమ్మ గద్దెలో ప్రాంగణంలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. తల్లుల దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కరెంటు వైరు పలుచోట్ల తెగి కనిపించడంతో పాటు అతుకులుగా ఉన్నాయి. భక్తులు ఎవరైనా చూసుకోకుండా వాటిపై కాలు వేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
News January 14, 2026
వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నం.1

విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానం దక్కించుకున్నారు. ఇటీవల భీకర ఫామ్‌లో ఉన్న అతడు ICC తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ను వెనక్కి నెట్టి నాలుగేళ్ల తర్వాత ఫస్ట్ ప్లేస్‌కి చేరారు. రోహిత్ శర్మ మూడో ర్యాంకుకు పడిపోయారు. గిల్-5, శ్రేయస్-10 స్థానంలో ఉన్నారు. ఇక ఓవరాల్‌గా 28,068 రన్స్‌తో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా 34,357 పరుగులతో సచిన్ తొలి స్థానంలో ఉన్నారు.


