News March 26, 2025

ఏలూరు : ముళ్ల పొదల్లో పసికందు.. మృతి

image

తూ.గో జిల్లాలో పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును కుక్కలు పీకుతుండగా.. స్థానికులు గుర్తించి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే శిశువు చికిత్స పొందుతూ రా.12 గం.లకు మరణించిందని సీడీపీఓ నాగలక్ష్మి తెలిపారు. ఘటనపై FIR చేయించామని, వివరాల సేకరణకు అంగన్వాడీ సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు.

Similar News

News January 13, 2026

BHPL: ఆస్తి కోసం తమ్ముడిపై అన్న కుటుంబం దాడి

image

గణపురం మండలం సీతారాంపురంలో ఆస్తి వివాదం నేపథ్యంలో అన్న, అతడి భార్య, కుమారులు కలిసి తమ్ముడిపై కర్రలతో దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన మహమ్మద్ సర్వర్ అహ్మద్‌పై తీవ్రంగా దాడి చేయగా తలకు గాయాలయ్యాయి. బాధితుడు భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనపై గణపురం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 13, 2026

సంక్రాంతి: ఈ పరిహారాలు పాటిస్తే బాధలు దూరం

image

పుష్య మాసం, మకర రాశి శని దేవుడికి ప్రీతిపాత్రమైనవి. సంక్రాంతి రోజున శని అనుగ్రహం కోసం నువ్వుల నలుగుతో స్నానం చేయాలి. దారిద్ర్యం పోవాలంటే శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయాలి. పితృదేవతలకు తర్పణాలు వదిలితే కుటుంబానికి సుఖసంతోషాలు కలుగుతాయి. ఈ రోజు పెరుగు దానం చేయడం వల్ల సంతాన క్షేమం, సంపద, ఆయుష్షు లభిస్తాయి. ఈ చిన్న పరిహారాలు పాటిస్తే సకల బాధలు తొలగి శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.

News January 13, 2026

కోనసీమకు విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి సోదరి

image

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోనసీమలోని పెదపట్నంలంక గ్రామానికి మెగాస్టార్ చిరంజీవి సోదరి డాక్టర్ మాధవి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం విచ్చేశారు. మంగళవారం ఉదయం కోనసీమలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించి, సాయంత్రం అమలాపురంలో ప్రేక్షకులతో కలిసి ‘మన శంకరవర ప్రసాద్ గారు’ సినిమా చూడనున్నట్లు అమలాపురం చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లా చిట్టిబాబు తెలిపారు.