News March 26, 2025

ALERT: నేడు 108 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలో ఇవాళ 108 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం (15), విజయనగరం (21), మన్యం (10), అల్లూరి (8), అనకాపల్లి (7), కాకినాడ (7), కోనసీమ (3), తూర్పుగోదావరి (13), ఏలూరు (5), కృష్ణా (2), ఎన్టీఆర్ (6), గుంటూరు (3), పల్నాడు జిల్లాలోని 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. అలాగే ఇవాళ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.

Similar News

News February 18, 2026

ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

న్యూఢిల్లీలోని <>ఆయుష్<<>> మంత్రిత్వశాఖలో 7 కన్సల్టెంట్, లీగల్ కన్సల్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి LLB, BE/BTech, ME/MTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 64ఏళ్లు. వెబ్‌సైట్: https://ayush.gov.in

News February 18, 2026

ఫాల్గుణ మాసంలో ఇలా చేయండి: పండితులు

image

మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణం. ఈ నెలలో లక్ష్మీనారాయణులను భక్తితో కొలిస్తే శుభాలు కలుగుతాయని పండితుల మాట. ‘చంద్రుడు ఫల్గుణి నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరొచ్చింది. అర్జునుడికి ‘ఫల్గుణుడు’ అనే పేరుండటం మరో ప్రత్యేకత. దానధర్మాలు చేయడం, పవిత్ర నదులలో స్నానమాచరించడం వల్ల పుణ్యం లభిస్తుంది. ప్రకృతి వసంతానికి సిద్ధమయ్యే ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతనతో గడపడం ఉత్తమం’ అంటున్నారు.

News February 18, 2026

మిరప మొక్కల వేర్లపై బొడిపెలకు కారణమేంటి?

image

మిరప పంటకు నులి పురుగులు ఆశించడం వల్ల మొక్కల వేర్లపై బొడిపెలు ఏర్పడతాయి. దీని వల్ల పంటకు నష్టం వాటిల్లుతుంది. ఈ నులి పురుగుల నివారణకు ఎకరాకు 100 కిలోల వేప పిండిని చల్లి, మట్టిలో కలిసే విధంగా నీరు పెట్టాలి. ఈ పురుగులు ఆశించిన పొలంలో వంగ, టమాటా, బంగాళాదుంపలను సాగు చేయకూడదు. ఆవాలు, నువ్వులు, మొక్కజొన్న, చిరుధాన్యాలతో పంట మార్పిడి చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.