News March 26, 2025
సూర్యాపేట: ధాన్యం కొనుగోలుకు సన్నద్ధమవుతున్న యంత్రాంగం

సూర్యాపేట జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు ఉండొద్దని ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభించేలా సివిల్ సప్లై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,73,739 ఎకరాల్లో వరిసాగు చేయగా దాదాపు 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనాలు వేశారు.
Similar News
News April 1, 2025
హైదరాబాద్‌లోనే మాజీ మంత్రి కాకాణి..?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో ఆయన అరెస్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. కాకాణికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈక్రమంలో ఆయన పరారీలో ఉన్నారంటూ వదంతులు వచ్చాయి. హైదరాబాద్‌లోని తన నివాసంలో జరగనున్న ఫ్యామిలీ ఫంక్షన్ ఏర్పాట్లను కాకాణి పరిశీలించారంటూ ఆయన సోషల్ మీడియాలో మంగళవారం సాయంత్రం ఓ ఫొటో పోస్ట్ చేశారు. దీంతో ఆయన పరార్ అనే వార్తలకు తెరపడింది.
News April 1, 2025
కొడాలి నానిపై టీడీపీ దుష్ప్రచారం నమ్మొద్దు: అంబటి

AP: మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. గుండె ఆపరేషన్ కోసం ముంబై వెళ్లారని చెప్పారు. ఆయన ఆరోగ్యం విషమించిందంటూ టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని అభిమానులకు సూచించారు. కొడాలి నాని, వంశీ ధైర్యాన్ని కోల్పోయే నేతలు కాదన్నారు. త్వరలోనే వారిద్దరూ క్షేమంగా తిరిగొచ్చి టీడీపీని ఎదిరిస్తారని స్పష్టం చేశారు.
News April 1, 2025
కర్ణాటకలో డీజిల్ ధర పెంపు

కర్ణాటకలో డీజీల్ ధరలు పెరగనున్నాయి. డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం 21.7% శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో లీటరు డీజీల్ ధర ₹2 పెరిగి ₹91.02కి చేరుకోనుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే బెంగళూరులో ఇవాళ్టి నుంచి చెత్త పన్ను కూడా వసూలు చేయనుంది. నివాస భవనాల విస్తీర్ణాన్ని బట్టి నెలకు ₹10 నుంచి ₹400 వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.