News March 26, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అన్నమయ్య ఎస్పీ

UPI మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఓ ప్రకటనను విడుదల చేశారు. యు.పి.ఐ వ్యవస్థను ఉపయోగించి వినియోగదారుల బ్యాంక్ ఖాతాల నుంచి సొమ్మును మాయం చేయడం సైబర్ నేరగాళ్ల పని అని తెలిపారు.
Similar News
News September 19, 2025
VJA: తండ్రితో వెళ్తుండగా ప్రమాదం.. కుమారుడి మృతి

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. సింగినగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాటి గిరిబాబు అనే వ్యక్తి తన తండ్రితో కలిసి నడిచి వెళ్తుండగా, వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. ఈ ఘటనలో గిరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 19, 2025
విమానంపై పిడుగు పడితే ఏమవుతుందంటే?

వర్షాల సమయంలో ఎగురుతున్న విమానాలు కొన్నిసార్లు పిడుగుపాటుకు గురవుతుంటాయి. అయితే ఎన్ని పిడుగులు పడినా ఫ్లైట్ లోపల ఉన్నవారికి ఏమీ కాదు. ఎందుకంటే ప్రస్తుతం విమానాలను ఫెరడే కేజ్ అనే లేయర్‌తో తయారు చేస్తున్నారు. ఈ ప్రత్యేక లోహం ఫ్లైట్‌లోకి విద్యుదయస్కాంత క్షేత్రాలు వెళ్లకుండా నియంత్రిస్తుంది. పిడుగు పడగానే ఇవి ఈ లోహపు నిర్మాణం గుండా ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లిపోతాయి. దీని వల్ల ఎవరికీ ఏమీ కాదు.
News September 19, 2025
22 నుంచి జూబ్లీహిల్స్ పెద్దమ్మకు పల్లకి, పవళింపు సేవ

దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో 22 నుంచి అక్టోబర్ 2 వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయంలో ఏర్పాటు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఉ.3 గంటలకు పెద్దమ్మ తల్లికి అభిషేకం చేస్తారు. ప్రతిరోజు రాత్రి అమ్మవారి ఉత్సవమూర్తి పల్లకి సేవ ఊరేగింపు, పవళింపు సేవ చేయనున్నారు.