News March 25, 2024
గోవాలో తొలిసారి మహిళకు బీజేపీ ఎంపీ టికెట్

గోవాలో తొలిసారిగా బీజేపీ నుంచి ఓ మహిళ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, డెంపో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పల్లవి డెంపో(49)ను సౌత్ గోవా నుంచి బీజేపీ బరిలోకి దింపింది. పల్లవి భర్త శ్రీనివాస్.. గోవా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌కు అధిపతిగా ఉన్నారు. కాగా సౌత్ గోవాలో 1962 నుంచి ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే బీజేపీ గెలిచింది.
Similar News
News January 30, 2026
మహల్ ప్రభుత్వ ఆసుపత్రికి కలెక్టర్

కలికిరి మండలం మహల్ ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్వర రాజుకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని ఆదేశించారు.
News January 30, 2026
వరల్డ్ కప్ గెలిస్తే ఇంకేం చేస్తారో?.. పాక్ పీఎం ట్వీట్‌పై సెటైర్లు!

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ ఇప్పుడు SMలో ట్రోల్స్‌కు గురవుతోంది. ఆస్ట్రేలియా ‘B’ టీమ్‌పై గెలిస్తేనే ప్రపంచకప్ గెలిచినంతగా PCB ఛైర్మన్‌ను ఆకాశానికెత్తడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక WC గెలిస్తే ఏం చేస్తారో అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇది అతిగా ఉందన్నారు.
News January 30, 2026
మధ్యాహ్నం కునుకు.. బ్రెయిన్‌కు ఫుల్ కిక్కు

మధ్యాహ్నం పూట చిన్న నిద్ర (Nap) వల్ల రాత్రి నిద్రతో సమానమైన ఎఫెక్ట్ ఉంటుందని రీసెర్చర్స్ తేల్చారు. వాళ్ల స్టడీ ప్రకారం.. రోజంతా పనులు, ఆలోచనల వల్ల బ్రెయిన్‌లోని నెర్వ్ సెల్స్ బాగా అలసిపోతాయి. ఇలాంటి టైమ్‌లో ఒక చిన్న కునుకు తీస్తే బ్రెయిన్ కనెక్షన్స్ మళ్లీ రీ-ఆర్గనైజ్ అవుతాయి. బ్రెయిన్‌పై లోడ్ తగ్గి కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధమవుతుంది. ఇన్ఫర్మేషన్ మరింత ఎఫెక్టివ్‌గా స్టోర్ అవుతుంది.


