News March 26, 2025

గద్వాల జిల్లా ఆదర్శం..!

image

జోగులాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో వివిధ రకాల విధులు నిర్వహిస్తారు. పారిశుద్ధ్య చర్యలు, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రత తదితర పనులతో ప్రజలు ఆర్థికంగా ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతున్నారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో ప్రజలు ఆర్థికంగా, ఆత్మగౌరవంతో మరింత బలోపేతమయ్యారు.

Similar News

News December 30, 2025

SRPT: ప్రజావాణి పిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

సూర్యాపేట జిల్లాలోని ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు. వివిధ విభాగాల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

News December 30, 2025

స్పెర్మ్ డొనేషన్.. ఈ రూల్స్ తెలుసా?

image

* 3-5 రోజులు శృంగారానికి దూరంగా ఉండాలి.
* 21-45 వయసుతో ఫిజికల్‌గా, మెంటల్‌గా హెల్తీగా ఉండాలి.
* స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్‌ అలవాటు ఉండకూడదు.
* 1ml స్పెర్మ్‌లో 15-20 మిలియన్ల కణాలలో 40% యాక్టివ్ సెల్స్ ఉండాలి.
* HIV, హెపటైటిస్ B, C, సిఫిలిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వ్యాధులు ఉండకూడదు.
* డొనేట్ చేసిన 6నెలల తర్వాత డోనర్‌కు మరోసారి టెస్టులు చేసి నెగటివ్ వస్తేనే స్పెర్మ్‌ ఉపయోగిస్తారు.

News December 30, 2025

పోక్సో కేసులు 34% వరకు తగ్గుముఖం: సిద్దిపేట సీపీ

image

2025 పోలీస్ శాఖ వార్షిక నివేదికలో పోక్సో కేసుల్లో 34% తగ్గు ముఖం పట్టాయని తెలిపారు. క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్స్ కేసులు 589 నుంచి 572కు తగ్గాయన్నారు. 731 ప్రాపర్టీ ఆఫన్స్ కేసుల్లో ఇప్పటి వరకు రూ.1,42,69,301 వర్త్ ప్రాపర్టీ రికవరీ చేశామన్నారు. 2024తో పోలిస్తే 2025లో మర్డర్ కేసులు 12% తగ్గాయన్నారు. 2024తో పోలిస్తే 2025లో 4% ఎక్కువ సాధారణ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు.