News March 25, 2024

విజయనగరం: పెళ్లి కార్డుపై ఆరు గ్యారంటీలు

image

టీడీపీ మీద ఉన్న అభిమానన్ని ఓ వ్యక్తి కొత్తగా పంచుకున్నారు. బలిజపేట మండలానికి బసన్నారాయువలస గ్రామానికి కృష్ణారావు వివాహం మార్చి 24 ఆదివారం జరిగింది. టీడీపీ సూపర్ సిక్స్ పథకాల వివరాలను పెళ్లి కార్డుపై ముద్రించి బంధువులకు అందించారు. పథకాలతో పాటు చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ బొబ్బిలి, పార్వతీపురం తెదేపా అభ్యర్థుల చిత్రాలను ముద్రించారు. ప్రస్తుతం ఈ పత్రిక వైరల్‌గా మారింది.

Similar News

News March 22, 2026

VZM: రాములోరి కళ్యాణానికి భక్తులకు ఆహ్వానం

image

మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా రామతీర్ధం శ్రీ సీతారామస్వామి ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి ఉత్తరాంధ్ర భక్తులు తరలిరావాలని ఆలయ ఈవో వై.శ్రీనివాసరావు శనివారం కోరారు. కళ్యాణంలో పాల్గొనాలనుకునే దంపతులు రూ.1500 టికెట్ కొనుగోలు చేయాలని తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ ఆలయం వద్ద టికెట్లు లభ్యమవుతాయని, పాల్గొనే వారికి శేషవస్త్రాలు, తలంబ్రాలు, ప్రసాదం అందిస్తామన్నారు.

News March 21, 2026

VZM: ‘క్రమశిక్షణ, సేవాభావంతో ఉన్నత శిఖరాలు సాధ్యం’

image

మహాశివరాత్రి సందర్భంగా రామతీర్థం, పుణ్యగిరి ఆలయాల్లో భక్తుల క్యూలైన్ నిర్వహణలో సహకరించిన ఎన్‌సీసీ విద్యార్థులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తన కార్యాలయంలో శనివారం అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి, భవిష్యత్తుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎన్‌సీసీ ద్వారా సేవాభావం పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

News March 20, 2026

గ్యాస్ పొదుపుగా వాడుకోవాలి: VZM కలెక్టర్

image

జిల్లాలో గృహ వినియోగ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, డిమాండ్‌కు సరిపడా సరఫరా జరుగుతోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు శుక్రవారం నిర్వహించిన VC అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. అవసరానికి మించి గ్యాస్ బుకింగ్ చేయకుండా, పొదుపుగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్-సప్లై అంతరాన్ని తగ్గించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను అదేశించారు.