News March 26, 2025
మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్న రాజాసింగ్

మహబూబ్‌నగర్ జిల్లాకు BJP నేత, HYD గోషామహల్ MLA రాజాసింగ్ రానున్నారు. కోయిల్‌కొండ మండలం రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 13న ఈ కార్యక్రమం జరగనుందని చెప్పారు. ఆ రోజు పాలమూరులోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హిందూ బంధువులు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.
Similar News
News April 1, 2025
ADB: ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

ఆదిలాబాద్ కేంద్రీయ విద్యాలయ ఖాళీ సీట్లలో ప్రవేశానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. రెండో తరగతి నుంచి 8వ తరగతుల్లో ఖాళీ సీట్లు ఉన్నాయన్నారు. తాత్కాలిక ఖాళీల జాబితా, అర్హత ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ మొదలైన వాటికోసం వెబ్ సైట్ https://adilabad.kvs.ac.in/ సందర్శించాలని లేదా విద్యాలయాన్ని సందర్శించాలని కోరారు.
News April 1, 2025
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. జనగామ జిల్లా మహిళా మృతి

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పోలీసు ఎన్కౌంటర్‌లో జనగామ జిల్లాకు చెందిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను మృతి చెందారు. కాగా, రేణుకది దేవరుప్పుల మండలం కడవెండి గ్రామం. గ్రామంలో ఆమె మృతిపై తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె మరణాన్ని నిరసిస్తూ భావోద్వేగంతో స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News April 1, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.