News March 26, 2025
కునాల్ కమ్రాకు ప్రకాశ్ రాజ్ మద్దతు

కమెడియన్ కునాల్ కమ్రాకు నటుడు ప్రకాశ్ రాజ్ తన మద్దతును ప్రకటించారు. ‘లగే రహో డియర్ కునాల్. మనం ఈ సమస్యను కలిసి అధిగమిద్దాం. నీకు మరింత శక్తి లభించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండేపై వివాదాస్పద <<15877588>>వ్యాఖ్యలు<<>> చేయడంతో కమ్రా చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే.
Similar News
News November 14, 2025
టీయూ: ఎంఏ/ ఎంకామ్/ ఎమ్మెస్సీ పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ యూనివర్సిటీలో ఎంఎ/ ఎంకామ్/ ఎమ్మెస్సీ నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు ఆదేశాల మేరకు టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి, కంట్రోలర్ ప్రొఫెసర్ కే.సంపత్ కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కంట్రోలర్, డాక్టర్ నందిని, డాక్టర్ శాంతాబాయి డాక్టర్ తోకల సంపత్ తదితరులు పాల్గొన్నారు.
News November 14, 2025
ఉసిరిలో తుప్పు తెగులు – నివారణ ఎలా?

ఉసిరిలో తుప్పు తెగులు సోకిన చెట్ల ఆకులపై తొలుత గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఇవి తుప్పు రంగుకు మారతాయి. వాటిని మనం చేతితో ముట్టుకుంటే ఆ రంగు మన చేతికి అంటుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ తెగులు రావడం వల్ల కాయలు పక్వదశకు చేరే కంటే ముందే రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్ 1ml లేదా ప్రొపికొనజోల్ 1ml కలిపి చెట్టుపై పిచికారీ చేయాలి.
News November 14, 2025
డబ్బుల పంపిణీతోనే ‘జూబ్లీ’లో కాంగ్రెస్ గెలుపు: కిషన్‌రెడ్డి

TG: దేశ ప్రజలు కాంగ్రెస్‌కు మంగళం పాడేశారని బిహార్ ఎన్నికల ఫలితాలు తేల్చాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. SIRను వ్యతిరేకిస్తున్న రాహుల్ వాదనను ప్రజలు తోసిపుచ్చారన్నారు. ECIకి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లో తామెన్నడూ గెలవలేదని, ఉపఎన్నికలో కాంగ్రెస్ డబ్బులతో గెలిచిందని విమర్శించారు. EVMలపై ఆరోపణలు చేస్తున్న రాహుల్ ‘జూబ్లీ’ గెలుపుపై సమాధానం చెప్పాలన్నారు.


