News March 26, 2025
SLBCలో 33వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు

శ్రీశైలం ఎడమగట్టు పరిధి నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రబాద్‌లోని SLBC టన్నెల్‌లో గల్లంతైన వారికోసం సహాయక చర్యలు మరింత ముమ్మరం చేశారు. బుధవారం 33వ రోజు సహాయక చర్యలు ప్రారంభించారు. మొత్తం 8మంది గల్లంతు కాగా వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే.మరో ఆరుగురి కోసం సహాయక చర్యలను చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News April 1, 2025
ATP: మట్టి ఎత్తిన కలెక్టర్ వినోద్ కుమార్

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం తాళ్లకేర గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పశువుల నీటి తొట్టెకు మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ చెలికతో మట్టి ఎత్తి పనులు ప్రారంభించారు. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా శంకుస్థాపనలో పాల్గొన్నారు. గ్రామస్థులు, కూటమి నాయకులు ఉన్నారు.
News April 1, 2025
విశాఖలో చిన్నారులతో భిక్షాటన

విశాఖలో చిన్నపిల్లలతో భిక్షాటన చేయించడం రోజురోజుకు ఎక్కువ అవుతోంది. మరికొందరు ఒడిలో నెలల పిల్లలను పెట్టుకుని మరీ ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ వద్ద భిక్షాటన చేస్తున్నారు. ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో చిన్నపిల్లలు సొమ్మసిల్లుతున్న పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా లంకెలపాలెం, అగనంపూడి, గాజువాక వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
News April 1, 2025
STOCK MARKETS: కొనసాగుతున్న బ్లడ్ బాత్

దేశీయ స్టాక్ మార్కెట్స్‌లో బ్లడ్ బాత్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 1428 పాయింట్లు కోల్పోయి 75,986 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 372Pts నష్టంతో 23,147 వద్ద కొనసాగుతోంది. IT, రియాల్టీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు పతనమయ్యాయి.