News March 26, 2025
సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. ఇప్పుడెలా ఉందంటే?

రోడ్డు <<15881657>>ప్రమాదంలో<<>> గాయపడ్డ నటుడు సోనూసూద్ భార్య సోనాలీ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నాగ్‌పూర్ మ్యాక్స్ ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది. కోల్‌కతా నుంచి వచ్చిన సోనాలీని ఆమె సోదరి సునీత, మేనల్లుడు సిద్ధార్థ్ ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నా ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో ప్రాణాలకు ముప్పు తప్పింది.
Similar News
News January 26, 2026
తక్కువ పంట కాలం, అధిక ఆదాయం.. బీర పంటతో సొంతం

సీజన్‌తో పనిలేకుండా ఏడాది పొడవునా పండే కూరగాయల్లో బీర ముఖ్యమైంది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తుంది. పైగా మార్కెట్‌లో దీనికి డిమాండ్ ఎక్కువ. పందిరి విధానంలో బీర సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పంటకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. బీర పంట సాగు, అధిక ఆదాయం రావడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 26, 2026
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

<
News January 26, 2026
ఇంటింటికీ ‘Prestige’.. ఫౌండర్‌కు పద్మశ్రీ

వంటింట్లో ఉండే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. అలాంటి ప్రెషర్ కుక్కర్‌ను మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత టీటీకే ప్రెస్టీజ్ గ్రూప్ అధినేత జగన్నాథానికి దక్కుతుంది. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం మరణానంతరం పద్మశ్రీతో గౌరవించింది. ప్రెషర్ కుక్కర్స్‌లో సేఫ్టీ మెకానిజాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రెస్టీజ్‌కు బ్రాండ్‌ను క్రియేట్ చేసి ‘కిచెన్ మొఘల్’ అయ్యారు.


