News March 26, 2025
పోరాటయోధుడు ధర్మభిక్షం

స్కూల్లో తన పట్టాభిషేక రజతోత్సవాలను జరపాలన్న నిజాం ఆదేశాలను ధిక్కరించి సంచలనం సృష్టించాడో విద్యార్థి. ఆయనే బొమ్మగాని ధర్మభిక్షం. NLG జిల్లా ఊకొండిలో 1922 ఫిబ్రవరి 15న లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు జన్మించాడు ధర్మభిక్షం. 1942లో CPIలో చేరి నిజాంపై సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి యుద్ధరంగంలోకి దిగి, సాయుధ పోరాటాన్ని విస్తరించారు. మూడు సార్లు MLAగా, రెండు సార్లు MPగా గెలుపొందారు. నేడు ఆయన వర్ధంతి
Similar News
News February 25, 2026
కేయూ: మార్చి 6 నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు

కేయూలో వాయిదా పడిన మొదటి సెమిస్టర్ పరీక్షల రీషెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ ఆచార్య రాజేందర్ కట్ల ప్రకటించారు. ఎంసీఏ మొదటి పేపర్ మార్చి 6న, రెండో పేపర్ మార్చి 9న, మూడో పేపర్ మార్చి 11న, నాలుగో పేపర్ మార్చి 13న, ఐదో పేపర్ పరీక్ష మార్చి 17న నిర్వహించనున్నారు. ముందగా ప్రకటించిన సెంటర్లలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు.
News February 25, 2026
గుంటూరు: ‘27న సత్యం, న్యాయాన్ని సమాధి చేస్తున్నారు’

తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును సీబీఐ క్లోజ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయేషా తల్లిదండ్రులు శంషాబాద్ బేగం, ఇక్బాల్ బాషా స్పందించారు. ఆయేషా మీరా శరీర అవశేషాలను ఈనెల 27న తిరిగి ఖననం చేయనున్నట్లు తెలిపారు. 18 ఏళ్లుగా పోరాడుతున్నప్పటికి తమ బిడ్డకు న్యాయం జరగలేదన్నారు. సత్యం, న్యాయం, ధర్మాన్ని 27న సమాధి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.