News March 26, 2025
ఓట్ల కోసమే విభజన రాజకీయం: యోగి

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో కొంతమంది దేశంలో విభజనలను సృష్టిస్తున్నారని UP CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇతరులను కించపరచడం సరికాదని చట్టం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఓట్ల కోసమే ప్రాంతం, భాష పేరుతో ప్రాంతాల మధ్య విభేదాలు తెస్తున్నారని, యూపీలో తెలుగు, తమిళ భాషలు నేర్చుకుంటున్నప్పుడు తమిళనాడులో హిందీ నేర్చుకుంటే తప్పేంటి అని యోగి ప్రశ్నించారు.
Similar News
News April 1, 2025
స్టాక్ మార్కెట్స్ క్రాష్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎరుపెక్కాయి. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఆరంభంలోనే బేర్ పంజా విసిరింది. సెన్సెక్స్ 1160 పాయింట్ల భారీ నష్టంతో 76,220 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 273Pts కోల్పోయి 23,246 వద్ద కొనసాగుతోంది. Bajaj finserv, infosys, HDFC బ్యాంక్, Sriram, Bajaj finance షేర్లు భారీగా పడిపోయాయి.
News April 1, 2025
మా పాఠశాలల్లో తెలుగు, తమిళం బోధిస్తున్నాం: UP CM యోగి

త్రిభాషా విధానంలో భాగంగా తమ రాష్ట్రంలోని స్కూళ్లలో తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ తదితర భాషలు బోధిస్తున్నట్లు UP CM యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. దీనివల్ల తమ స్టేట్ ఏమైనా చిన్నదైపోతుందా? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. త్రిభాషా విధానం వల్ల కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించగలుగుతున్నట్లు చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే TN CM స్టాలిన్ ఈ విధానంపై వివాదాలు రాజేస్తున్నారని యోగి మండిపడ్డారు.
News April 1, 2025
పిల్లల విషయంలో.. తల్లిదండ్రులకు మానసిక వైద్యుల సూచన

ఉద్యోగ జీవితంలో తల్లిదండ్రులు బిజీ అయిపోవడంతో పిల్లలు ఇరువురి ప్రేమకు దూరమైపోతున్నారు. ఇంట్లో మాట్లాడేందుకు ఎవరూ లేకపోవడంతో ఒంటిరైపోతున్నారు. కానీ, పిల్లలతో మాట్లాడుతూ ఉండాలని మానసిక వైద్యులు చెబుతున్నారు. వారితో కలిసి ఒక్కపూటైనా భోజనం చేయాలని, ఏ విషయమైనా మాట్లాడుతూ ఉండాలని సూచిస్తున్నారు. పడుకునే ముందు ఓ కథ చెప్పడం, రోజులో ఏదో ఒక సమయంలో యాక్టివిటీలో పాల్గొనాలంటున్నారు.