News March 26, 2025

మేడ్చల్‌లో రాజకీయ నిరుద్యోగం..!

image

అర్బన్ జిల్లాగా మేడ్చల్ అవతరించడంతో రాజకీయ నిరుద్యోగం పెరగనుందని నేతన్నల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పంచాయత్ రాజ్ వ్యవస్థ కనుమరుగై గ్రామాలన్నీ పట్టణాలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. దీంతో సర్పంచ్, ఉపసర్పంచ్, MPTC, MPP, ZPTC, ZP ఛైర్మన్ వంటి 700కుపైగా పదవులు కాలగర్భంలో కలిసిపోనున్నాయి. రాజకీయంగా ఎదగాలనుకునే వారికి అవకాశం లేకుండా పోయింది. పట్టణీకరణతో తమ భవిష్యత్తుకే ఎసరు పెట్టారని పలువురు వాపోతున్నారు.

Similar News

News January 14, 2026

సిద్దిపేట: ‘కుల వివక్షతో యువ డాక్టర్ ఆత్మహత్య’

image

సిద్దిపేట మెడికల్ కాలేజీలో 4వ సంవత్సరం చదువుతున్న డాక్టర్ లావణ్య ఆత్మహత్య ఘటన సంచలనం సృష్టించింది. సీనియర్ డాక్టర్ ప్రణయ్ ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లి ప్రస్తావన రాగానే కులం పేరుతో నిరాకరించడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై ఎమ్మార్పీఎస్, డీబీఎఫ్ నాయకులు అదనపు కలెక్టర్‌ను కలిసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.

News January 14, 2026

మరో 9 అమృత్‌ భారత్‌ రైళ్లు.. ఏపీ మీదుగా వెళ్లేవి ఎన్నంటే?

image

కేంద్ర ప్రభుత్వం కొత్తగా 9 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో నాలుగు రైళ్లు పశ్చిమ బెంగాల్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు, బెంగళూరు వరకు పరుగులు తీయనున్నాయి. ఖరగ్‌పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన స్టేషన్లకు ఈ రైళ్లు కనెక్టివిటీని పెంచనున్నాయి. ఈ ట్రైన్లలో న్యూ జల్‌పాయ్‌గురి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే రైలు దేశంలోనే అతి పొడవైన రూట్లలో ఒకటిగా నిలవనుంది.

News January 14, 2026

సిరిసిల్ల: ప్రమాదాల నివారణకు సహకరించాలి: ఎస్పీ

image

ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి రోడ్డు ప్రమాదాలను నివారణకు సహకరించాలని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గీతె అన్నారు. సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు మంగళవారం రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపడం ద్వారా మీ ప్రాణాలే కాకుండా ఎదుటివారి ప్రాణాలు కూడా కాపాడిన వారు అవుతారని ఆయన పేర్కొన్నారు.