News March 26, 2025
కొడంగల్: తిరుపతిరెడ్డిపై పోస్ట్.. యువతిపై కేసు నమోదు

సీఎం రేవంత్ రెడ్డి అన్న, కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తిరుపతిరెడ్డి ఈనెల 22న కోస్గి మండలం బిజ్జూరంలో పర్యటించారు. ఆ సమయంలో ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతిపై కేసు నమోదు చేసినట్లు SIబాల్‌రాజ్ తెలిపారు. తిరుపతిరెడ్డి భూకబ్జాలు చేసేందుకు వచ్చాడని హన్మాన్‌పల్లి వాసి పద్మ వాట్సాప్ గ్రూపుల్లో ఆధారాలు లేకుండా తప్పుడు మెసేజ్ చేసిందని NSUIఅధ్యక్షుడు అశోక్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News November 11, 2025
ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు సమయం ఆసన్నం: పవన్

TTD కేవలం తీర్థయాత్ర స్థలం కాదని పవిత్రమైన ఆధ్యాత్మిక నిలయని Dy.CM పవన్ అన్నారు. “తిరుమల లడ్డూ తీపి కాదు. భక్తుల భావోద్వేగానికి ప్రతీక. ఏడాదికి సుమారు 2.5 కోట్ల మంది తిరుమలను సందర్శిస్తారు. సనాతనుల భావాలు, ఆచారాలు అవమానించబడితే భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మన విశ్వాసానికి గౌరవం, రక్షణ అవసరం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం బోర్డు ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని” అని పవన్ ట్వీట్ చేశారు.
News November 11, 2025
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు: కలెక్టర్ తేజస్

సరైన తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేసి, మిల్లులకు పంపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం ఆయన తిరుమలగిరి మండలం తొండ, కోక్యా నాయక్ తండా, ఫణిగిరిలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యత కలిగిన ధాన్యం కొనుగోలు విషయంలో అలసత్వం వహించవద్దని సూచించారు.
News November 11, 2025
ఏలూరు: ఈ కోర్సులో చేరేందుకు మెరిట్ లిస్ట్ విడుదల

ఏలూరు: హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సులలో ప్రవేశానికి 2వ ఫేజ్ కౌన్సిలింగ్‌కు మెరిట్ లిస్ట్‌ను గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నోటీసు బోర్డులో పొందుపరిచారు. ఈ విషయాన్ని ది వైద్య కళాశాల ప్రిన్సిపల్ సావిత్రి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 12న ఉదయం 10 గంటలకు కాలేజీలో వెరిఫికేషన్‌కు మెరిట్ లిస్టులోని అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలన్నారు.


