News March 26, 2025
ప్రజల కోసమే భూభారతి: పొంగులేటి

TG: ధరణి ఓ దుర్మార్గ చట్టమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. అందుకే భూభారతి చట్టం తీసుకొచ్చామని ఆయన అసెంబ్లీలో చెప్పారు. ‘ధరణి ఎజెండాతోనే మేం ఎన్నికలకు వెళ్లాం. ధరణి బాగుందా లేదా అని ఎన్నికల్లో ప్రజల తీర్పుతోనే స్పష్టమైంది. బీఆర్ఎస్ తప్పు చేసింది కాబట్టే ఓడించారు. భవిష్యత్‌లోనూ భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తాం. ఆ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతిస్తారో చూద్దాం’ అంటూ సవాల్ విసిరారు.
Similar News
News April 1, 2025
పీఎఫ్ విత్‌డ్రా లిమిట్ భారీగా పెంపు!

పీఎఫ్ విత్‌డ్రా లిమిట్‌ను పెంచేందుకు కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.లక్షగా ఉన్న ఆటో సెటిల్‌మెంట్ రూ.5 లక్షలకు పెంచాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో 7.5 కోట్ల మంది EPFO ఖాతాదారులకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. విద్య, వివాహ, ఇంటి ఖర్చులకు అప్లై చేసుకున్న మూడు రోజుల్లో పీఎఫ్ డబ్బులు ఖాతాలో జమచేస్తోంది.
News April 1, 2025
తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ స్ట్రీమింగ్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ OTT తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. కొన్ని రోజుల కిందటే ఇది అమెజాన్ ప్రైమ్ OTTలోకి రాగా, ఇవాళ్టి నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. యూత్ ఫుల్ లవ్ స్టొరీతో వచ్చిన ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించిన ఈ మూవీలో ప్రియాంకా మోహన్ స్పెషల్ సాంగ్‌లో కనిపించారు.
News April 1, 2025
కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ

AP: రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ప్రభుత్వ సిబ్బంది ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేస్తున్నారు. ఉదయం 8.40 గంటల వరకు 53.98 శాతం మేర, 34 లక్షల మందికి పైగా నగదు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, ఇవాళ ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలో పర్యటించనుండగా, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేయనున్నారు.