News March 26, 2025

నేత్రపర్వంగా భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకళ్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితరపూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మ వారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకళ్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Similar News

News March 8, 2026

హనుమకొండ: వైకల్యం ఆమెకి అడ్డు కాలేదు

image

హనుమకొండకు చెందిన డాక్టర్ రమాదేవి వైకల్యాన్ని అడ్డుగా భావించలేదు. మనోనిగ్రతతో ఉన్నత చదువులు పూర్తి చేశారు. ఆమె కేయూలో పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. పారా త్రో బాల్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి స్వర్ణ పథకం సాధించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ రమాదేవిని హనుమకొండలో అభినందించారు.

News March 8, 2026

ఈమె ఎదురీత ముందు విధిరాత ఎంత!

image

పదేళ్లు వీల్‌ఛైర్‌కు పరిమితమైన యువతి సివిల్స్ ఫలితాల్లో 483వ ర్యాంకు సాధించారు. ఆమెనే కేరళకు చెందిన అథిర(30). BDS చదువుతుండగా యాక్సిడెంట్ జరగడంతో తల, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ఛాతీ కింది భాగం ప్యారలైజ్ అయిపోయింది. రెండేళ్లు జ్ఞాపకశక్తి కూడా లేదు. ఆ తర్వాత BDS పూర్తి చేశారు. NGOలోని డిసెబిలిటీ వింగ్‌లో పనిచేయడంతో ఆత్మ విశ్వాసం పెరిగిందని, పేరెంట్స్&సిస్టర్ సాయంతో చదివానని అథిర తెలిపారు.

News March 8, 2026

ఇందిరాగాంధీనే ఎదిరించిన పాలమూరు వనిత..!

image

గద్వాల జిల్లా అలంపూర్‌లో జన్మించిన టి.లక్ష్మీకాంతమ్మ తెలంగాణ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఖమ్మం నుంచి ఒకసారి MLAగా, మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీని ఎదిరించి జనతాలో చేరారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సన్నిహితురాలు. పీవీ రాసిన ‘ది ఇన్‌సైడర్’ నవలలోని ‘అరుణ’ పాత్రకు స్ఫూర్తి అని ప్రతీతి. # నేడు అంతార్జాతీయ మహిళ దినోత్సవం